పాత బట్టలు పడేయకుండా వారికిస్తే.. అదృష్టం వద్దన్నా వస్తుంది!
ప్రతీ ఒక్కరి ఇంట్లో చాలానే పాత బట్టలు ఉంటాయి. వాడిన బట్టలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాడుతుంటారు. కొందరు పడేస్తుంటే మరి కొందరు ఎవరికైనా ఇచ్చేస్తుంటారు. అయితే మనం అందరం పాత బట్టల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. వాడిన బట్టలను మనం ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే మంచి జరుగుతుంది, ఎవరికి చెడు జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.కొందరు మాసిన బట్టలు ఎక్కవ అయ్యేంత వరకు ఇంట్లో మూట కట్టి వారానికొకసారి ఉతుకుతుంటారు. అలా మాసిన బట్టలు ఇంట్లే పెట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీ అస్సలే ఉండదట. అంతే కాకుండా దరిద్ర దేవత ఇంట్లోకి చేరి తిష్ట వేసుకొని కూర్చుంటుందట.
అందకే ఎక్కువగా మాసిన బట్టలను అస్సలే ఇంట్లో ఉంచుకోకూడదు. అంతే కాకుండా సాయంత్రం సమయంలో అస్సలే బట్టలను ఉతకకూడదు. కేవలం ఉదయం మధ్యాహ్న సమయంలో మాత్రమే బట్టలు ఉతకాలి. ఎందుకంటే సూర్యరశ్మి పడే చోటనే బట్టలు ఆరేయాల్సి ఉంటుంది. నీడలో ఆరేయడం వల్ల బట్టలు ముక్కు వాసన వస్తాయి. అలాగే ఒకరి బట్టలను ఇంకొకరు వేసుకోకూడదు. అలా వేసుకోవడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. అంతే కాకుండా ఇంట్లో ఉన్న బట్టలు ముక్క వాసన వచ్చే వరకు అస్సలే ఉంచకూడదు.కొంతమంది ఒకసారి వేసుకున్న బట్టలు రెండు మూడ్రోజుల పాటు వేసుకుంటారు. అలా వేసుకోకూడదు. పాత బట్టలను ఒకరికి ఇవ్వడం వల్ల వారికి ఉపయోగపడతాయి.
కానీ పాత బట్టలను ఇచ్చినప్పుడు దాన్ని దానం వేసినట్లు అనుకోకూడదు. కొత్త బట్టలు ఇచ్చినట్లయితే అది దానం అవతుంది. ఎవరికైనా బట్టలు లేవు ఇబ్బందుల్లో ఉన్నారంటే జాలిపడి పాత బట్టలు ఇస్తే అది సాయం వస్తుంది. ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీ దేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఆడవారు ఉదయాన్నే నిద్ర లేచి స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని, పూజా, వంట పూర్తి చేసుకొని… ఇల్లంతా హారతి, సామ్రాణి వేసి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా శుచి, శుభ్రతతో ఉంటే లక్ష్మీ దేవి మీతోపాటు మీ ఇంట్లోనే ఉంటుంది.