Palmistry : చేతి గోర్లను బ‌ట్టి మీ లైంగిక శ‌క్తి తెలుసుకోవ‌చ్చు.. ఇలా ట్రై చేయండి..!

 Authored By aruna | The Telugu News | Updated on :16 August 2022,6:00 am

మన చుట్టూ ఉండేవారిలో చాలా మంది చేతి వేళ్లను పొడవుగా పెంచుకుంటుంటారు. కొందరికీ అది సరదా కావచ్చు. మరికొందరు ఫ్యాషన్ పేరుతో పెంచుకుంటుంటారు. అయితే, హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం గోర్లు పెంచుకునే వారు ఎటువంటి మనస్తత్వం కలిగిన వారో తెలుసుకోవచ్చట.. అంతేకాకుండా ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం కూడా తెలుసుకోవచ్చంటున్నారు పండితులు..వేలి గోళ్ల గుర్తులు, మచ్చలు, పొడవు, వెడల్పు కూడా వక్తి జీవితాన్ని తెలియజేస్తుంది.

Palmistry : గోళ్లు పొడవుగా పెంచుకునేవారి కోసం..

మన చేతి వేళ్లకు గల గోర్లపై తెల్లని మచ్చలు ఉంటే వారి జీవితంలో చాలా ఒత్తిడి ఉంటుంది.ఎముకల బలహీనతకు కూడా కారణం కావొచ్చు. ఒత్తిడి పెరిగే కొద్దీ ఈ మచ్చలు వస్తూ ఉంటాయి.గోళ్లపై నలుపు లేదా పసుపు మచ్చలు ఉన్నవారు విజయం కోసం చాలా కష్టపడాలి. ఆరోగ్య బలహీనతను కూడా ఇది సూచిస్తుంది. గరుడ పురాణం ప్రకారం గోర్లు పసుపు రంగులో లేదా సులభంగా విరిగిపోయే వ్యక్తికి ఇతరుల కంటే తక్కువగా లైంగిక శక్తి ఉంటుంది. గోర్లు వంకరగా, గీతలు ఉన్నవారు ఆర్థిక సమస్యలను చాలా ఎదుర్కొవాల్సి ఉంటుంది. గోళ్లపై మచ్చలు ఉండి, అందంగా కనిపించని వారు ఇతరులకు సేవ చేస్తూ కడుపు నింపుకుంటారట.

Palmistry Tips Nails Can Identify your Seksual Power

Palmistry Tips Nails Can Identify your Seksual Power

ఇక గోళ్లు ఎరుపు,ప్రకాశవంతమైన గులాబీ రంగులో ఉన్నవారిని చాలా అదృష్టవంతులుగా చెబుతోంది హస్తసాముద్రిక శాస్త్రం.వారి గోర్లు కొద్దిగా పొడుగుగా గులాబీ రంగును కలిగి ఉంటే అది అదృష్టానికి సూచికగా పరిగణించబడుతుంది. మధ్య వేలు ఉంగరపు వేలు కంటే పెద్దదిగా ఉండాలి. చూపుడు వేలు మధ్య వేలు కంటే పెద్దదిగా ఉండాలి. బొటనవేలు చూపుడు వేలు కంటే పెద్దదిగా ఉండాలి. అటువంటి గోర్లు ఉన్నవారికి ఆందోళన తక్కువగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు పడకుండా అనుకున్ని సాధిస్తారు.

Advertisement

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి