Plant Vastu : ఈ చెట్ల‌ను ఇంట్లో పెట్టండి.. అదృష్టం మీ వెంటే ఉంటుంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Plant Vastu : ఈ చెట్ల‌ను ఇంట్లో పెట్టండి.. అదృష్టం మీ వెంటే ఉంటుంది..!

 Authored By mallesh | The Telugu News | Updated on :11 February 2022,6:00 am

Plant Vastu : మ‌న హిందూ సాంప్ర‌దాయంలో అనేక ప‌ద్ధ‌తులు ఉంటాయి. వాటిని చాలామంది వ్య‌తిరేకిస్తుంటారు కానీ.. శాస్త్రీయ‌త ప్రకారం వాటి వెన‌క చాలా పెద్ద కార‌ణాలే ఉంటాయండోయ్‌. అయితే మ‌న ఇండ్లో డ‌బ్బులు నిల్వ ఉండాలంటే ఓ ఎనిమిది మొక్క‌ల‌ను పెంచుకోవాల‌ట‌. మ‌రి అవేంటో చూద్దాం. ఇందులో మొద‌ట‌గా అశోక వృక్షం గురించి చూద్దాం. ఈ మొక్క చాలా ప్ర‌త్యేక‌మైంది. ఇది ఎన్ని కష్టాలు ఉన్నా తొల‌గిస్తుందంట‌. దీన్ని మ‌త ప‌ర‌మైన కార్య‌క్ర‌మాల్లో చాలా ప్ర‌త్యేకంగా కొలుస్తారు. ఇక రెండోది మనీ ప్లాంట్. ఇది చాలామందికి తెలుసు.

దీన్ని ఆర్థికంగా లాభ‌ప‌డేందుకు పెంచుకుంటారు. దీని వ‌ల్ల వ‌చ్చే గాలి ఇంట్లో ప్రతికూలత వాతావ‌ర‌ణాన్ని తొల‌గిస్తుందంట‌. తూజా చెట్ల‌ను సరస్వతీ దేవికి ప్ర‌తిరూపంగా కొలుస్తారు. వీటి వ‌ల్ల పిల్ల‌ల చ‌దువు బాగా పెరిగి వారు ఆర్థికంగా సెటిల్ అవుతారంట‌. నాలుగోది కుబేరాక్షి.. ఇది అదృష్టాన్ని తీసుకు వ‌స్తుందంట‌. ఎంత‌టి దుర‌దృష్ట వంతులు అయినా దీన్ని పెంచుకుంటే కొంతైనా మేలు జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు. లక్ష్మీ కమలం మొక్క ప్ర‌తి మ‌నిషి జీవితంలో సూర్యోద‌యాన్ని సూచిస్తుందంట‌. అంటే క‌ష్టాల నుంచి సుఖం వైపు ప్ర‌యాణించేలా చేస్తుందంట‌.

plant vastu put these trees at home luck will be with you

plant vastu put these trees at home luck will be with you

Plant Vastu : ప్ర‌తికూల‌త తొల‌గుతుంది..

ఇక ఆరో వృక్షం తులసి. ఇది దాదాపు అంద‌రికీ ప‌రిచ‌యం ఉంటుంది. హిందువులు దీన్ని అత్యంత భ‌క్తితో కొలుస్తారు. ఇది ఇంట్లో ఉంటే అభివృద్ధి ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెబుతుంటారు. అందుకే దీన్ని ఎక్కువ‌గా పెంచుకుంటారు. ఇక ఏడోది శమీ మొక్క. ఇది శనిని నివారించే మొక్క‌గా పేరుగాంచింది. దీన్ని పూజిస్తే ఎలాంటి శ‌నిదోషం అయినా తొల‌గిపోతుంద‌ని చెబుతుంటారు. ఇక చివ‌ర‌గా ఎనిమిదోది నల్ల పసుపు మొక్క‌. ఇది రాబోయే చెడు శక్తిని పార‌దోలుతుంది. ఎలాంటి ఆర్థిక ప‌ర‌మైన న‌ష్టాలు అయినా దీని వ‌ల్లే ఇట్టే తొల‌గిపోతాయంట‌.

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది