Pongal Special : సంక్రాంతి గొబ్బెమ్మలు ఎందుకు పెడుతారు.. వాటి విశిష్టత ఇదే..!
Pongal Special 2022 : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే అతి పెద్ద పండుగ ‘సంక్రాంతి’. కాగా, ఈ ఫెస్టివల్‌కు అందరూ సొంతూళ్లకు వెళ్లి హాయిగా గడిపేస్తుంటారు. ఇక ఏపీలో అయితే కోళ్ల పందేలు జోరుగా ఉంటాయి. అలా నాలుగు రోజుల పాటు ఎంచక్కా హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు. సూర్య భగవానుడు అలా మకర రాశిలోకి ప్రవేశించిన రోజున సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. భోగి మంటలు వేసుకుని గంగిరెద్దుల ఆటలు, పిండి వంటలు, హరి దాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు ఇలా మొత్తం కోలాహలంగా ఉంటుంది. ఈ క్రమంలోనే సంక్రాంతికి వేసే ముగ్గులలో గొబ్బెమ్మలను పెడుతుంటారు. కాగా, గొబ్బెమ్మలకున్న విశిష్టత ఏంటో తెలుసుకుందాం.
సంక్రాంతి పండుగ .. తొలి రోజును భోగిగా, రెండో రోజును మకర సంక్రాంతిగా, మూడో రోజును కనుమగా పిలుస్తుంటారు. ఇక నాలుగో రోజును ముక్కనుమ అని అంటుంటారు. అలా నాలుగు రోజుల పాటు హ్యాపీగా పొంగల్ ఫెస్టివల్ జరుపుకుంటారు. సంక్రాంతి రోజున రంగు రంగుల ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలు పెట్టడం ఆనవాయితీ. అలా సంప్రదాయం ప్రకారం… గొబ్బెమ్మను పెడుతుంటారు. అలా పెట్టే గొబ్బెమ్మను గౌరిమాత అని పిలుస్తారు.
Pongal Special : గొబ్బెమ్మలతో ఇంటికి లక్ష్మీ దేవి..
గొబ్బెమ్మలను కాత్యాయినీ దేవిగా ఆరాధిస్తారు. పండుగ రోజున ముగ్గు వేసి ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టి.. వాటిని పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. అలా చేస్తే కనుక భర్త బతికే ఉన్న పుణ్య స్త్రీతో ఉన్నాడని అర్థమట. ఇకపోతే అందులో పెట్టే గొబ్బెమ్మను గోదా దేవీగా పూజిస్తారు. అలా గొబ్బెమ్మల పక్కనున్న ముగ్గుల చుట్టు ఆడపడుచులు తిరుగుతుంటారు. అలా ఇంటి ఆడపడుచులు సందడి చేస్తుంటారు. ఇకపోతే ముగ్గులు, గిబ్బెమ్మలు రెండూ.. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి. కాగా, పండుగ రోజున ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలను పెడితే కనుక ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వనిస్తున్నట్లు అని విశ్వాసం. అలా అందరూ సంక్రాంతి పండుగను చాలా ఇష్టంగా జరుపుకుంటారు.