Zodiac Signs : ధనుర్మాసంలో ఈ రాశుల వారికి విపరీతమైన రాజయోగం తీసుకువస్తున్న భాస్కరుడు…!
ప్రధానాంశాలు:
Zodiac Signs : ధనుర్మాసంలో ఈ రాశుల వారికి విపరీతమైన రాజయోగం తీసుకువస్తున్న భాస్కరుడు...!
గ్రహాలకు అధిపతి అయిన భాస్కరుడు డిసెంబర్ మాసమున 15వ తేదీ ఆదివారం 10 గంటల 19 నిమిషాలకు ప్రవేశిస్తున్నాడు. ధనస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వలన ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. 2025 లో జనవరి 14వ తేదీ వరకు ఈ రాశిలోనే సంచారం చేస్తాడు. తరువాత సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే భాస్కరుడు ధనస్సు రాశిలో సంచారం చెయడం వలన కొన్ని రాశులకు విపరీతమైన రాజయోగం ను తీసుకువస్తుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం….
Zodiac Signs కర్కాటక రాశి
గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు ధనస్సు రాశిలోకి భానుడు ప్రవేశం వలన కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలను పొందబోతున్నారు. కర్కాట రాశి వారికి రాబోయే కాలంలో ఆకస్మిక ధనయోగం వచ్చె అవకాశం ఉంది. ఈ రాశి వారు ఏ పని చేయాలన్నా ఈ సమయం చాలా కలిసి వస్తుంది. ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది. బిజినెస్ కి అయ్యే ఖర్చు సమయానికి అందుతుంది.
సింహరాశి : సింహరాశికి రాజు భానుడు. సూర్య భగవానుడు ధనస్సు రాశి లో ప్రవేశించడం వలన అనేక శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారికి చాలా సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. సింహరాశి వారికి ధనస్సు రాశి వస్తూ వస్తూ కొన్ని శుభవార్తలను తెస్తుంది. కుటుంబం నుంచి పూర్తి సహాయ సహకారం అందుతుంది. సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. సూర్యుడి ప్రవేశం వలన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.
తులా రాశి : ధనస్సు రాశి ప్రవేశం వలన తులా రాశి వారికి అద్భుతమైన శుభ ఫలితాలను తెస్తుంది. ఈ రాశి వారు ఏ పని చేసినా ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. ఇష్టపడి చేసిన పనికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆగిపోయిన పనులు మళ్లీ పునరావృతం చేసుకోగలుగుతారు. తులారాశి వారికి ఆరోగ్యము, అదృష్టము బాగుంటాయి.
ధనస్సు రాశి : ఈ రాశిలో సూర్యుడు ప్రవేశించడం వలన ధనస్సు రాశి వారికి కూడా కలిసి వస్తుంది. ఈ సమయంలో ధనస్సు రాశి వారికి ఏ పనులు చేసిన అన్నిట్లో విజయాలను సాధిస్తారు.
ఈ రాశి వారికి ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. అలాగే ఉద్యోగ వృత్తిలో పురోగతి ఉంటుంది. మీ వృత్తిలో మీ పనికి తగిన ప్రశంసనలను అందుకుంటారు. కానీ తులా రాశి వారికి ఆరోగ్యం పట్లా తగు జాగ్రత్త వహించాలి.
కుంభరాశి : భాస్కరుడు కుంభ రాశిలోకి ప్రవేశించడం వలన అదృష్ట యోగం పట్టబోతుంది. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు త్వరగా ఒక కొలిక్కి వస్తాయి. రావలసిన బకాయిలు రాక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో. వారికి డబ్బు త్వరగా చేతికి అంతే అవకాశం ఎక్కువగా ఉంది. సూర్యుడి ఆశీస్సులు వలన చెసే పనిలో అనేక ప్రయోజనాలు కలిసి వస్తాయి. కుటుంబంలో వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది.