Tulsi plant : తులిసిని ఇంట్లో పూజించడానికి గల కారణాలు ఏంటి.. పురాణాలు ఏం చెబుతున్నాయి..?
Tulsi plant: ఇంట్లో తులసి మొక్క ఉండటం అనాధిగా వస్తున్న ఆచారం. ముఖ్యంగా హిందువుల ఇండ్లలో ఉదయాన్నే తులసిని పూజించడం మనం చూస్తున్నాం. పల్లె టూర్ల నుంచి పట్నం దాకా ఇలా అన్ని ప్రాంతాల్లో తులసిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. మరి అసలు ఇన్ని మొక్కలు ఉండగా.. కేవలం తులసినే ఎందుకు పూజించాలి, తులసినే ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలి అనే ప్రశ్నలు ఎప్పటినుంచో వస్తున్నాయి. అయితే వీటికి కచ్చితమైన జవాబులు దొరకవు. కానీ పురాణాల ప్రకారం తులసిని ఎందుకు పూజించాలో కొన్ని కారణాలు అయితే ఉన్నాయి.తులసి మొక్కను ఇలా పూజించడానికి ముఖ్యంగా ఐదు లక్షణాలు ఉన్నట్టు తెలుస్తోంది. తులసి మొక్క ఇంట్లో ఉంటే ఎలాంటి ప్రమాదాలు జరగవనేది మొదటి నమ్మకం.
అలాగే తులసి అంటే మహావిష్ణువుకు ప్రీతికరమైన మొక్క. తులసి ఆకులతోనే శ్రీహరిని పూజించడం మనం చూస్తున్నాం. అందుకే తులసి ఇంట్లో ఉంటే ఎలాంటి నెగెటివ్ ఆలోచనలు రాకుండా ఉంటాయని చెబుతుంటారు. ఇక రెండో కారణం ఏంటంటే.. ఆకాశంలో గ్రహణం పట్టడానికి ముందు తినే పదార్థాల్లో వేస్తే ఎలాంటి చెడు ప్రభావం ఉండదని నమ్ముతుంటారు.ఇక మూడో కారణం ఏంటంటే.. తులసి చెట్టులో ఔషధ గుణాలు పుష్కలం. ఈ ఆకులను వాడితే ఎలాంటి జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి తీవ్రమైన నొప్పులు కూడా చిటికెలో మాయం అవుతుంటాయి. వ్యాప్తి చెందే రోగాలని తక్షణమే తగ్గిస్తాయి. అందుకే వాటిని ఇంట్లో పెంచుకుంటారు.
Tulsi plant : 24గంటలు ఆక్సిజన్ ఇస్తుంది..
ఇక నాలుగో కారణం.. కొత్తగా ఇల్లు నిర్మించేటప్పుడు పసుపు రంగుతో తులసి వేరును ఇంటి పునాది నిర్మాణంలో పెడితే.. ఎంత పెద్ద తుఫాను వచ్చినా ఇంటి మీద పిడుగులు పడకుండా ఉంటాయని నమ్మకం. ఇక చివరి కారణం ఏంటంటే.. మిగతా చెట్ల కంటే భిన్నంగా.. తులసి మొక్క రోజంతా ఆక్సిజన్‌ను ఇస్తుంది. రాత్రి పూట కూడా ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టే తులసిని ఇంట్లో పెంచుకుంటారు. తులసి ఉన్న చోట గాలి చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఇలా అనేక రకాల కారణంగా తులసిని ఇంట్లో పెంచుకుంటారని పురాణాలు చెబుతున్నాయి.