దేవుడికి ఏ నైవేద్యం పెడితే ఏం ఫలితం ?
దేవుడు.. పూజలు.. ఒక్కొక్కరు ఒక్కోరకంగా దేవుడిని ఆరాధిస్తారు. తమ శక్తికొలది భక్తితో దేవుడిని ఆరాధించడం చేస్తారు. పూర్వకాలం నుంచి మనం దీనికి సంబంధించి అనేక కథనాలు వింటూనే ఉన్నాయి. పురాణాలలో, ఇతిహాసాలలో కూడా వీటికి సంబంధించిన గాథలు అనేక ఉన్నాయి. ఉదాహరణకు కన్నప్ప తను తినే మాంసాహారాన్ని దేవుడికి సమర్పించాడు. శబరి తను తినే పండ్లను రామచంద్రడికి సమర్పించంది. ఇలా ఒక్కో భక్తుడు ఒక్కొ రకం. అయితే ఆయా నైవేద్యాల సమర్పణ వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో సందేహం అక్కర్లేదు. ఉండాల్సింది భక్తి, శ్రద్ధ. అయితే ఏ నైవేద్యాల వల్ల ఏం ఫలితమో తెలుసుకుందాం….
మొదటగా అందరికీ ఎక్కువగా తక్కువ ఖర్చులో దొరికే జామపండు నైవేద్యం ఫలితం తెలుసుకుందాం…
జామపండును వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తే పొట్టకు సంబంధించిన సమస్యలు అంటే.. గ్యాస్ట్రిక్, ఉదర సంబంధిత వ్యాధులు నయమవుతాయి. దేవీ అంటే అమ్మవారికి నైవేద్యంగా పెడితే చక్కెర వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు. అదేవిధంగా సంతాన ప్రాప్తి, దాంపత్యంలో వచ్చే కలహాలు తొలగుతాయి. సంఘంలో మంచి పలుకుబడి. గణపతికి పంచామృత అభిషేకం చేసి జామపండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారాలు చాలా లాభసాటిగా సాగిపోతాయి.
ఇక ప్రతి ఒక్కరు గుడికి పోగానే కొట్టే కొబ్బరికాయ నైవేద్యం గురించి తెలుసుకుందాం…
కొబ్బరికాయ నైవేద్యం పెట్టడం వల్ల పనులు సులభంగా కావడానికి. అనుకున్న రీతిలో సాఫీగా పనులు సాగిపోవడానికి, కార్యాలయాలలో పై అధికారుల నుంచి ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు రాకుండా ఉండటానికి కొబ్బరిక నైవేద్యం పెట్టాలి. వేసవిలో ఎక్కువగా దొరికే ఫల రాజు అయిన మామిడి పండు నైవేద్యంగా సమర్పిస్తే బకాయిలు వసూలు అవుతాయి. వినాయకుడికి మామిడి పండు సమర్పిస్తే ఇండ్లు కట్టుకునే వారికి గృహ నిర్మాణ సమస్యలు తీరుతాయి. బకాయిలు చెల్లించడానికి కావాల్సిన సొమ్ము సకాలంలో వస్తుంది. లక్ష్మీగణపతిహోమం చేయించి మామిడి పండును పూర్ణాహుతిలో సమర్పిస్తే చిట్టీల వ్యవహారాలు చక్కబడతాయి. పాత బకాయిలు వసూలు అవుతాయి. ఇష్ట దైవానికి తేనే, మామిడి రసాలతో నైవేద్యం సమర్పించి దాన్ని అందరికీ పంచి మీరు కూడా స్వీకరిస్తే విశేష ఫలితాలు వస్తాయి.
తక్కువ ఖర్చులో దొరికే మరో పండు కమలా పండ్లు దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు నెరవేరుతాయి. నమ్మకమైన వ్యక్తులు ముందుకొచ్చి సహాయపడుతారు. అన్నింటా విజయం సాధిస్తారు.
సపోటా పండు వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి. వివాహ సంబంధాలు ఖాయమవుతాయి. వివాహం కానివారికి తొందరడా వివాహం నిశ్చయం అవుతుంది. నేరేడు పండును నైవేద్యంగా సమర్పించే దాన్ని స్వీకరిస్తే నీరసం, నిరుత్సాహం దూరం అవుతాయి. శనీశ్వరుడికి ప్రసాదంగా పెడితే వెన్ను, నడుం, మోకాళ్ల నొలు మాయమవుతాయి. విష్ణువు, శివుడికి ఈ పండ్ల నైవేద్యం మంచి ఫలితాలను ఇస్తుంది. ద్రాక్షపండ్లు దేవుడికి ప్రసాదంగా పెడితే. ఆనందం, సంతోషం లభిస్తాయి. ఈ విధంగా ఆయా రకాల పండ్లను భక్తితో శ్రద్ధతో ఆయా దేవతలకు సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి. పెట్టిన పండును లేదా పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించిన తర్వాత తప్పక ప్రసాదంగా స్వీకరించాలి. అంతేకాదండోయో దాన్ని పదిమందికి వితరణ చేయాలి. వారిలో భగవంతుడిని చూడాలి అప్పుడే సంపూర్ణ ఫలితం వస్తుంది.