
Maha Shivaratri Srisailam : మాఘమాసం అంటేనే ముందు గుర్తుకు వచ్చేది మహాశివరాత్రి. ఈ పర్వదినం కోసం శివభక్తులు వేయికండ్లతో ఎదురుచూస్తుంటారు. ద్వాదశ జ్యోతిర్లంగంగా, అష్ఠాదశ శక్తిపీఠంగా పేరుగాంచిన భూలోక కైలాసం శ్రీశైలం. శ్రీగిరిగా, రత్నగిరిగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. దీనికోసం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ముస్తాబవుతోంది. ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి4 వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మొత్తం 11 రోజులు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
Maha Shivaratri Srisailam
కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. దీనికి సంబంధించి భారీగా భక్తులు రానున్నారు. వీరికోసం ఇబ్బంది కలుగకుండా ఉండేటా ఆలయ అధికారులు చర్చలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా యజ్ఞవాటిక వద్ద (నిర్మాణంలో ఉన్న గణేశసదనానికి ఎదురుగా) తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులకు, కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులకు పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతోందని తెలిపారు.
ఇక యజ్ఞవాటిక వద్ద, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎడమవైపు ప్రదేశం, ఘంటామఠం వెనుకభాగం, దేవస్థానం ఆగమపాఠశాల ఎదురుగాగల ఆరుబయలు ప్రాంతాలలో కార్ పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయబడుతున్నాయని చెప్పారు. పార్కింగ్ ప్రదేశాలలో ఇప్పటికే ప్రారంభించిన జంగిల్ క్లియరెన్స్ పనులను వేగవంతం చేసినట్లు తెలిపారు. ఆయా పార్కింగ్ ప్రదేశాలకు చేరుకోవలసిన దారులు, పార్కింగ్ స్థలాలు స్పష్టంగా తెలిసేవిధంగా ఫ్లెక్సీబోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్నొన్నారు.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.