Maha Shivaratri Srisailam : శివరాత్రికి ముస్తాబవుతున్న శ్రీశైలం ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Maha Shivaratri Srisailam : శివరాత్రికి ముస్తాబవుతున్న శ్రీశైలం !

Maha Shivaratri Srisailam : మాఘమాసం అంటేనే ముందు గుర్తుకు వచ్చేది మహాశివరాత్రి. ఈ పర్వదినం కోసం శివభక్తులు వేయికండ్లతో ఎదురుచూస్తుంటారు. ద్వాదశ జ్యోతిర్లంగంగా, అష్ఠాదశ శక్తిపీఠంగా పేరుగాంచిన భూలోక కైలాసం శ్రీశైలం. శ్రీగిరిగా, రత్నగిరిగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. దీనికోసం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ముస్తాబవుతోంది. ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి4 వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మొత్తం 11 […]

 Authored By keshava | The Telugu News | Updated on :28 February 2021,9:59 am

Maha Shivaratri Srisailam : మాఘమాసం అంటేనే ముందు గుర్తుకు వచ్చేది మహాశివరాత్రి. ఈ పర్వదినం కోసం శివభక్తులు వేయికండ్లతో ఎదురుచూస్తుంటారు. ద్వాదశ జ్యోతిర్లంగంగా, అష్ఠాదశ శక్తిపీఠంగా పేరుగాంచిన భూలోక కైలాసం శ్రీశైలం. శ్రీగిరిగా, రత్నగిరిగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. దీనికోసం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ముస్తాబవుతోంది. ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి4 వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మొత్తం 11 రోజులు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Maha Shivaratri Srisailam

Maha Shivaratri Srisailam

కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. దీనికి సంబంధించి భారీగా భక్తులు రానున్నారు. వీరికోసం ఇబ్బంది కలుగకుండా ఉండేటా ఆలయ అధికారులు చర్చలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా యజ్ఞవాటిక వద్ద (నిర్మాణంలో ఉన్న గణేశసదనానికి ఎదురుగా) తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులకు, కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులకు పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతోందని తెలిపారు.

ఇక యజ్ఞవాటిక వద్ద, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎడమవైపు ప్రదేశం, ఘంటామఠం వెనుకభాగం, దేవస్థానం ఆగమపాఠశాల ఎదురుగాగల ఆరుబయలు ప్రాంతాలలో కార్ పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయబడుతున్నాయని చెప్పారు. పార్కింగ్ ప్రదేశాలలో ఇప్పటికే ప్రారంభించిన జంగిల్ క్లియరెన్స్ పనులను వేగవంతం చేసినట్లు తెలిపారు. ఆయా పార్కింగ్ ప్రదేశాలకు చేరుకోవలసిన దారులు, పార్కింగ్ స్థలాలు స్పష్టంగా తెలిసేవిధంగా ఫ్లెక్సీబోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్నొన్నారు.

keshava

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది