Shravana Masam : శ్రావణమాసంలో ఆడవారు ఈ రంగు పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ కోరిక తప్పక నెరవేరుతుంది
Shravana Masam : ఎంతో పవిత్రమైన శ్రావణమాసంలో చేసే పూజలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. సాధారణ రోజుల కంటే శ్రావణమాసంలో లక్ష్మీదేవిని ఎవరైతే ఎక్కువగా పూజిస్తారో ఆరాధిస్తారో వారి మీద లక్ష్మీదేవి అనుగ్రహాన్ని నిలుపుతుంది. అంత పవిత్రమైన శ్రావణమాసంలో లక్ష్మీదేవికి ఈ పూలతో పూజ చేసినట్లయితే నెల రోజులు పూజ చేసినంత పుణ్యం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఎంతో సులభంగా కలుగుతుంది. అయితే పరమ పవిత్రమైన శ్రావణమాసంలో లక్ష్మీదేవికి ఏ పూలతో పూజించాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..లక్ష్మి నామస్మరణ , దీపారాధన పూజలు ఇలా శ్రావణమాసం అంతా కూడా పండగ వాతావరణం ఉంది. శ్రావణమాసంలో శుభకార్యాలు అలాగే ఏ పని మొదలుపెట్టిన ఎటువంటి కార్యాలకైనా ఎంతో పవిత్రత ఉంటుంది.
ఈ శ్రావణమాసం నెలలో పౌర్ణమి రోజు చంద్రుడు శ్రవణా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణమాసం అని చెప్పబడుతుంది. శ్రీమహావిష్ణువు ధర్మపత్ని అయిన లక్ష్మీదేవి అమ్మవారిని అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణమాసం. ఈ మాసంలో పూజలు వ్రతాలు, నోములు ఆచరించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే శ్రావణమాసంలో దేవ గన్నేరు పూలను లక్ష్మీదేవికి సమర్పించి పూజించడం వలన లక్ష్మీదేవి యొక్క అపారమైన అనుగ్రహం కలుగుతుంది. ఈ పువ్వుల ప్రాముఖ్యత చాలా మందికి తెలిసే ఉంటుంది. దీని విశిష్టత ప్రాముఖ్యత కూడా తెలిసే ఉంటుంది ఈ చెట్టు ఎక్కువగా దేవాలయాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో కూడా పెంచుకుంటూ ఉంటారు. ఈ చెట్టు ఉన్న ఇల్లు దేవాలయం తో సమానంగా భావిస్తారు. ఈ చెట్టు ఉన్న వారి ఇంటిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.
ఈ చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ ప్రదేశం అంతా కూడా మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. దేవ గన్నేరు పూలు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. ఈ పూలతో లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. మాలగా చేసే లక్ష్మీదేవికి అలంకరించడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి చేరుతుంది. దాని ద్వారా ఇంట్లో లక్ష్మి నివాసం ఏర్పరచుకుంటుంది. అలాంటి ఇల్లు సకల శుభాలు, సుఖాలు, సంతోషాలు, ఐశ్వర్యాలను పొందుతుంది. శ్రావణమాసంలో కచ్చితంగా దేవగన్నేరు పూలమాలను అలంకరించి 21 పూలను అమ్మవారికి సమర్పించడం వలన లక్ష్మీదేవి ఆశీస్సులను పొందడమే కాకుండా తన అనుగ్రహం కచ్చితంగా మీ మీద కలిగేలాగా చేస్తుంది.
ఈ శ్రావణమాసంలో ఒక్కరోజైనా సరే ఈ దేవ గన్నేరు పూలతో లక్ష్మీదేవిని పూజించడం వలన నెల రోజులు పూజించినంత ఫలితం కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క అపారమైన అనుగ్రహం మీకి కలుగుతుంది. శ్రావణమాసంలో ఒక్కరోజైనా ఈ దేవగన్నేరు పూలతో లక్ష్మీదేవిని పూజించండి ఆ చల్లని తల్లి కరుణ పొందండి…