Shri krishna Janmashtami : శ్రీ కృష్ణాష్టమి రోజు ఇంట్లో ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shri krishna Janmashtami : శ్రీ కృష్ణాష్టమి రోజు ఇంట్లో ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం…!

 Authored By ramu | The Telugu News | Updated on :24 August 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Shri krishna Janmashtami : శ్రీ కృష్ణాష్టమి రోజు ఇంట్లో ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం...!

Shri krishna Janmashtami : శ్రీమహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడుగా జన్మించిన కృష్ణ జన్మాష్టమిని , గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి ,కృష్ణాష్టమి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఏ విధంగా పూజ చేస్తే మంచిది. ఆ కృష్ణుడికి ఏ నైవేద్యం పెడితే ఫలితం దక్కుతుంది. ఏ దీపం పెడితే ఐశ్వర్యవంతులవుతారు. కృష్ణాష్టమి రోజున పాటించాల్సిన నియమాలు ఏమిటి ఈ విషయాలన్ని కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు జననం, ఆయన జీవితం అంతా కూడా ఒక అద్భుతం. యుగయుగాలుగా ఆయన తత్వం ఆయన జీవితం మానవ జీవితాలను విశేషంగా ప్రభావితం చేస్తుంది. ఉత్తరప్రదేశ్లోని మధురలో కృష్ణుడు జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించండి. పూజా మందిరాన్ని చక్కగా శుభ్రం చేసుకోండి. గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు ముగ్గులు వేయాలి.

దేవుడి పటాలను పసుపు కుంకుమ గంధం పుష్పాలతో చక్కగా అలంకరించుకోవాలి. పూజ మందిరంలో శ్రీకృష్ణుడు రాధతో ఉన్న ఫోటోని గాని ప్రతిమను గాని ఉంచాలి. పూజకు పసుపు అక్షంతలు సుగంధ పుష్పములతో మాలనీ తయారు చేసుకోవాలి.ఆ తర్వాత నైవేద్యానికి పానకము వడపప్పు మధురమైన ఫలాలు వంటివి సిద్ధం చేసుకోవాలి. మధ్యాహ్నం 12 గంటలకు పూజలు ప్రారంభించాలి. కొబ్బరి నూనె పోసి ఐదు దూది వత్తులతో దీపాన్ని వెలిగించాలి. దీపారాధనకు ఆవు నేతితో హారతిని సిద్ధం చేసుకోవాలి. నుదిటిన సింధూరాన్ని ధరించి తూర్పు దిక్కున తిరిగి ” ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. శ్రావణ మాసంలో లభించే పళ్ళు సొంటి బెల్లం కలిపిన వెన్న పెరుగు మీగడ స్వామికి నైవేద్యంగా పెట్టాలి. ఉయ్యాల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలను కీర్తనలు కూడా కొంతమంది పాడుతూ ఉంటారు. అలాగే వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి కొడుతూ ఉంటారు. అందుకే ఈ పండుగ నీ ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాళ్ళు అని పిలవడం కూడా జరుగుతుంది. ఇక పూజ సమయంలో బాలకృష్ణ స్తోత్రం శ్రీకృష్ణ సహస్రనామాలు భాగవతములతో శ్రీకృష్ణుని స్తుతించాలి.

Shri krishna Janmashtami శ్రీ కృష్ణాష్టమి రోజు ఇంట్లో ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం

Shri krishna Janmashtami : శ్రీ కృష్ణాష్టమి రోజు ఇంట్లో ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం…!

ఆ తర్వాత శ్రీకృష్ణుడికి నైవేద్యలు సమర్పించి దీపారాధన చేసి పూజాని ముగించాలి. ఇక కృష్ణాష్టమి రోజున ఒంటి పూట భోజనం చేసి శ్రీకృష్ణుడికి పూజ చేసి శ్రీ కృష్ణ దేవాలయాలను గౌరీ మట్ట వాళ్ళను దర్శించేవారికి కోటి జన్మల పూర్వ ఫలం లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఆలయాల్లో కృష్ణ స్తోత్ర పూజ కృష్ణ సహస్రనామ పూజ చేయించే వారికి వంశాభివృద్ధి కలుగుతుందని పురోహితులు చెబుతున్నారు. గోకులాష్టమి రోజున ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలం తో పాటుగా శ్రీకృష్ణ నిత్య పూజ పుస్తకాన్ని కూడా అందజేస్తే సకల సంపదలో సిద్ధిస్తాయని మన పెద్దలు చెప్తారు. భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతం ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం అభిస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది