Women : ఇలాంటివి కలిగి ఉన్న ఆడవారు చాలా అదృష్టవంతులు… సాముద్రిక శాస్త్రం ఏం చెబుతుందంటే…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Women : ఇలాంటివి కలిగి ఉన్న ఆడవారు చాలా అదృష్టవంతులు… సాముద్రిక శాస్త్రం ఏం చెబుతుందంటే…!

Women : ఆడవారి శరీర అమరిక అంగస్తం బట్టి వారి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెబుతుంది. అందం కంటే కూడా ఇవి చాలా ముఖ్యం అట. అందుకే పూర్వంలో పెళ్లి చూపులకు వెళ్లేటప్పుడు పెద్దవారు అమ్మాయి ఒడ్డు పొడుగు నడక అన్ని పక్కాగా చూసేవారు.కానీ ప్రస్తుత రోజుల్లో అన్ని ఆన్ లైన్ లోనే అయిపోతున్నాయి కాబట్టి అంత పట్టింపు ఉండడం లేదు. అయితే సాముద్రిక శాస్త్రం అనేది జ్యోతిష్యంలో అంతర్భాగం. దీనిలో మనిషి […]

 Authored By ramu | The Telugu News | Updated on :11 June 2024,2:30 pm

ప్రధానాంశాలు:

  •  Women : ఇలాంటివి కలిగి ఉన్న ఆడవారు చాలా అదృష్టవంతులు... సాముద్రిక శాస్త్రం ఏం చెబుతుందంటే...!

Women : ఆడవారి శరీర అమరిక అంగస్తం బట్టి వారి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెబుతుంది. అందం కంటే కూడా ఇవి చాలా ముఖ్యం అట. అందుకే పూర్వంలో పెళ్లి చూపులకు వెళ్లేటప్పుడు పెద్దవారు అమ్మాయి ఒడ్డు పొడుగు నడక అన్ని పక్కాగా చూసేవారు.కానీ ప్రస్తుత రోజుల్లో అన్ని ఆన్ లైన్ లోనే అయిపోతున్నాయి కాబట్టి అంత పట్టింపు ఉండడం లేదు. అయితే సాముద్రిక శాస్త్రం అనేది జ్యోతిష్యంలో అంతర్భాగం. దీనిలో మనిషి తల నుండి పాదాల వరకు శరీరంలోని ప్రతిభాగం గురించి వివరంగా చెప్పడం జరిగింది. శరీర భాగాల పొడవు వాటి అమరిక బట్టి వారు ఎలాంటివారు వారి వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పవచ్చు. ఇంకా చేతులు కాళ్లు నిర్మాణం బట్టి వారి జీవితం ఎలా ఉండబోతుంది, ఎలాంటి జీవిత భాగ్య స్వామి వస్తుంది వారి ఆయుర్దాయం ఎంత ఇలా ఎన్నో విషయాలు చెప్పవచ్చని సాముద్రిక శాస్త్రం చెబుతుంది. మరి వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Women : నుదుటి భాగం

స్త్రీలకు నుదుటి భాగం వెడల్పుగా ఉంటే వారు చాలా అదృష్టవంతులట బొట్టు పెట్టుకునే ప్రదేశం నుండి పాపిట వరకు ఎంత వెడల్పుగా ఉంటే అంత అదృష్టమని సాముద్రిక శాస్త్రం చెబుతుంది.

Women కనుబొమ్మలు

అలాగే రెండు కనుబొమ్మలకు మధ్య వెంట్రుకలు ఉన్న అదృష్టమేనట.

Women రెండు కళ్ళ మధ్య గ్యాప్.

అదేవిధంగా రెండు కళ్ళ మధ్య ఎంత గ్యాప్ ఎక్కువగా ఉంటే అంత దనం లభిస్తుందట. కళ్ళు పెద్దగా ఉండి వాటి చుట్టూ నల్లటి చారలు ఉంటే వారికి సమాజంలో గౌరవం పలుకుబడి ఉంటాయి.

Women చిటికెని వేలు ఉంగరపు వేలు మధ్య గ్యాప్

అలాగే చిటికెన వేలుకి ఉంగరపు వేలుకి గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. ఎక్కడైనా వీరి మాటే చెల్లుబాటు అయ్యేలా ఉంటుంది.

Women ఉంగరపు వేలు

చూపుడు వేలు కన్నా ఉంగరపు వేలు పొడవుగా ఉంటే ఇక వారికి తిరిగే ఉండదు. ఇలాంటి వారు పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది.వారికి ప్రస్తుతం అంతగా కలిసి రాకపోయినా కూడా భవిష్యత్తు మాత్రం చాలా ఉన్నతంగా ఉంటుందని చెప్పవచ్చు. వీరిని మన పెద్దవాళ్లు భాగ్య ఉంగరపు వేలు అని అంటారు.

Women అరచేయి

అరచేయి విశాలంగా ఉన్న స్త్రీలు ధనాన్ని ఎక్కువగా పోగు చేస్తారట. వీరి దగ్గరికి ధనం రావడమనే ఉంటుంది కానీ పోవడం అనేది ఉండదట.

పాదాలు.

ఇక పాదాల వేళ్ళ విషయానికి వస్తే కాలి బొటనవేలు మిగతా వాటి కంటే పెద్దగా ఉండి మిగిలిన వేళ్ళు పైనుండి కిందకు ఒక క్రమంలో ఉంటే వారు చాలా అదృష్టవంతులట.

బొటనవేలు కంటే పక్కన వెళ్లి పొడవుగాఉంటే.

బొటనవేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉన్న స్త్రీలు చాలా ధైర్యవంతులట.దేనికి భయపడకుండా ముందుకు వెళ్తారు. సమాజమంతా వీరికి చాలా గర్వం అని చెవులు కోరుకున్న వారు అవేమీ పట్టించుకోకుండా తమ పనిలో ముందుకు వెళ్తూ ఉంటారు.

బొటని వేలు కంటేవేలు పెద్దది ఉంటే.

బొటనవేలు కంటే పక్కన వేలు పెద్దగా ఉన్న స్త్రీలు పుట్టిట్లో కంటే అత్తవారింట్లో ఎక్కువగా సుఖపడతారట. అక్కడ వీరి మాటే శాసనంగా ఉంటుంది.

Women ఇలాంటివి కలిగి ఉన్న ఆడవారు చాలా అదృష్టవంతులు సాముద్రిక శాస్త్రం ఏం చెబుతుందంటే

Women : ఇలాంటివి కలిగి ఉన్న ఆడవారు చాలా అదృష్టవంతులు… సాముద్రిక శాస్త్రం ఏం చెబుతుందంటే…!

అరికాలి పాదం నేల మీద

అలాగే కొంతమందికి పాదం నేలపై పూర్తిగా ఆనితే కొంతమందికి కాలు మొత్తం ఆనకుండా మధ్యలో గ్యాప్ ఉంటుంది.ఎవరికైతే పాదం పూర్తిగా నేలకు అనుతుందో అలాంటివారు చాలా అదృష్టం వంతులు అలాకాకుండా ఎవరైతే అరికాలు పూర్తిగా నేలకు ఆనకుండా కొంచెం వంకరగా ఉంటుందో వారు కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

పొడవాటి జుట్టు.

కొంతమంది ఆడవాళ్లకు నడుము కింద వరకు పొడవైన జుట్టు కలిగి ఉంటుంది. అయితే ఇది చూడడానికి ఆకర్షణీయంగా ఉన్న అంత మంచిది కాదని సాముద్రిక శాస్త్రం చెబుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది