Wake up : నిద్ర లేవగానే చూడవలసినవి.. చూడకూడనివి ఏమిటో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Wake up : నిద్ర లేవగానే చూడవలసినవి.. చూడకూడనివి ఏమిటో తెలుసా..?

 Authored By aruna | The Telugu News | Updated on :16 February 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Wake up : నిద్ర లేవగానే చూడవలసినవి.. చూడకూడనివి ఏమిటో తెలుసా..?

Wake up : ఎవరికైనా అనుకోని ఆపద ఎదురైనప్పుడు ఈరోజు లేవగానే ఎవరి ముఖం చూసాడో ఇలా జరిగింది అని చాలా మంది అంటూ ఉంటారు. అలాగే ఏదైనా అనుకొని విధంగా కలిసి వచ్చినప్పుడు అబ్బ ఈరోజు లేచినప్పుడు ఎవరు ముఖం చూసాడో చాలా మంచిది అని అంటుంటారు. నిద్ర లేవగానే ముందుగా ఏం చేయాలి. లేచిన సమయం ఆరోజు ఏ విధంగా ఉండాలో ఎలా నిర్ణయిస్తుంది. దీని గురించి మన శాస్త్రాల్లో ఏమని చెప్పబడింది. తదితర ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.. చాలామంది ఉదయం లేవగానే తమ అరచేతులు చూసుకొని అప్పుడు మంచి దిగుతారు. ఇలా రెండు అరచేతుల్ని చూసుకోవడం వెనుక ఒక పరమార్ధం దాగి ఉంది.

లేచి కళ్ళు తెరిచాక రెండు చేతులు ఎందుకంటే అరచేతులలో లక్ష్మి మధ్య భాగాన సరస్వతి చివరి భాగాన గౌరీదేవి ఉన్నట్లుగా భావిస్తూ ప్రార్ధన కాలమున వారిని స్మరించుకుంటే ఆ రోజంతా శుభం జరుగుతుంది. అని మన పురాణాల్లో చెప్పబడింది. అలానే దీని వెనుక సైన్స్ కూడా ఉంది. మన శరీరంలో నిరంతరం విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. నిద్ర లేవగానే ఎప్పుడైతే మన అరచేతుల్ని చూసుకున్నాము.. కంటి ద్వారా బయటకు వచ్చిన విద్యుత్ మన అరచేతుల మీద ప్రసరించి తిరిగి మన శరీరంలోకి వచ్చేసి న్యూట్రల్ అవుతుంది. దీనివల్ల శరీరం బాలన్స్డ్ ఉండి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అలానే లేచినప్పుడు ఎవరిని చూడాలో ఎవరిని చూడకూడదు మన శాస్త్రాల్లో చెప్పబడింది. ఆవాలు నెయ్యి పెరుగు తేనె పువ్వులు ప్రకృతి తెల్లటి పక్షి కొబ్బరికాయ అద్దం హోమగుండం చూస్తే చాలా మంచిదట.

అలాగే నిద్ర లేవగానే ఎదుటి వ్యక్తి పాదాలు చూస్తే దరిద్రమట. అదే విధంగా నిద్రలేచినప్పుడు ముందుగా చెప్పులు, చెత్తబుట్ట, పగిలిన అద్దం, గొడవ పడుతున్న వ్యక్తులు, జుట్టు విరవేసుకున్న స్త్రీ, కడగకుండా వదిలేసిన ఎంగిలి పాత్రలు, గుడ్డివారు, సొట్ట వారు, మొండి గోడలను చూస్తే మంచిది కాదట. మంచం మీద నుండి కిందకు దిగుతున్నప్పుడు ముందుగా భూమాతకు నమస్కరించుకుని అమ్మ నాకు నీ మీద ఆవాసం ఏర్పరుచుకోవడానికి అవకాశం ఇచ్చావు. నీకు ఎప్పటికీ రుణపడి ఉంటానని మనసులో స్మరించుకొని అప్పుడు పాదం కింద పెట్టాతారట.. అలాగే బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారుజాము మూడు గంటల 30 నిమిషాల నుండి 5 గంటల మధ్యలో నిద్రలేస్తే చాలా మంచిది..

Tags :

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది