Laxmi Devi : కుబేర పచ్చ కుంకుమ ఇంట్లో ఉంటే.. లక్ష్మీ దేవి ఇంటిని వదిలిపోదు..!
Laxmi Devi : కుబేర పచ్చ కుంకుమ గురించి ఎక్కువ మందికి తెలియదు. కానీ ఆ కుంకుమ గురించి తెల్సిన వారందరూ… దానిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు. ప్రతీ రోజూ కాకపోయినప్పటికీ పండుగలు, పబ్బాలు లేదా శుక్ర వారాల్లో కచ్చితంగా పెట్టుకుంటారు. ఇందుకు కారణం ఆ కుబేరుడుకి ఎంతో ఇష్టమైన కుబేర పచ్చ కుంకుమని ధరిస్తే… లక్ష్మీదేవి తమ ఇంటిని వదిలిపోదనే నమ్మకం. మూడో కోట్ల దేవతల అందరిలో కుబేరుడే అత్యంత ధనవంతుడు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన వల్ల పుట్టిన పచ్చ కుంకుమను ధరిస్తే… కచ్చితంగా తాము కూడా ధనవంతులు అయిపోవచ్చనే నమ్మకం అందరికీ ఉంటుంది. అసలు ఈ కుంకుమ ఎలా పుట్టింది, ఆ కుంకుమ అంటే కుబేరుడుకి ఎందుకంత ఇష్టమో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కుబేరుడు మామూలుగానే పరమేశ్వరుడి భక్తుడు. అయితే ఒక రోజు కుబేరుడు కైలాసానికి వెళ్లాడు. అయితే ఆ సమయంలోనే శివ పార్వతులు నాట్యం చేస్తున్నారు. కామ వేదనలో ఉన్న వారిద్దరూ దగ్గరగా ఉండటాన్ని కుబేరుడు చూశాడు. అయితే ఆ దృశ్యాన్ని చూసి… పార్వతీ దేవిని తల్లిగా భావించాల్సిన కుబేరుడు.. కామంతో చూశాడట. విషయం గుర్తించిన శివుడు కుబేరుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పరమ శివుడిలో సగ భాగం అయిన పార్వతీ దేవికి కూడా విషయం బోధపడింది. అమ్మలా చూడాల్సిన తనను కుబేరుడు ఆ రకంగా చూడటాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఓ వైపు భరించలేని బాధ, మరో వైపు విపరీతమైన కోపంతో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కుబేరుడిని చూశారు. ఆ కోపాగ్నికి కుబేరుడి శరీరం అంతా కాలిపోయింది.

special story of kubera pachha kunkuma For Laxmi Devi
కుబేరుడు విషయం గ్రహించేలోపే తన తనువంతా బూడిద అయింది. వెంటనే ఆ ఆది దంపతులను క్షమించమంటూ వేడుకున్నాడు. తనకు తెలియకుండానే ఇదంతా జరిగిపోయిందని, ఇంకో సారి ఇలాంటి తప్పు చేయనని లెంపలేసుకున్నాడు. అయితే కుబేరుడిని క్షమించిన శివ పార్వతులు… మా కోపంతో కాలిపోయిన నీ శరీరం, మాలో మళ్లీ వచ్చిన శాంతంతోనే బాగవుతుందని తెలిపారు. అంతే కాకుండా శివుడి కంఠం చుట్టూ ఉన్న నీల వర్ణం.. పార్వతీ దేవి బంగారు ఛాయను తాకి… ఈ కిరణాలు భూమిపై పడ్డాయి. అలా పడిన కిరణాలతో.. ఈ నేలంతా ఆకపచ్చ రంగులోకి మారింది. ఆ విషయాన్ని గుర్తించిన కుబేరుడు… వారి కిరణాలు పడ్డ మట్టినే కుంకుమగా భావించి ఒళ్లంతా రాసుకున్నాడు. అలా ఆకుపచ్చ రంగులో ఉన్న కుంకుమను రాసుకోగానే తన శరీరం మామూలు స్థితికి వచ్చేసింది. అప్పటి నుంచి కుబేరుడు ప్రతీ రోజు ఆ మట్టినే… కుంకుమగా పెట్టుకునేవాడు. అలా ఆ పచ్చ కుంకుమ కుబేరుడికి ప్రీతి పాత్రమైంది. కుబేరుడికి ఇష్టమైన ఆ కుబేర పచ్చ కుంకుమను ప్రతీ రోజు మీరు కూడా ధరిస్తే… లక్ష్మీ దేవి మీ ఇంట్లోనే తిష్ట వేస్తుంది.