Sravana Masam : శ్రావణమాసంలో ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంచినట్లయితే మీకు శివుడి అనుగ్రహం తప్పక కలుగుతుంది.
Sravana Masam : శ్రావణమాసం ఈ నెలలో 29వ తేదీ నుండి ప్రారంభమైనది. ఈ శ్రావణమాసం మొదలైంది. అంటే చాలు ఆడవారు ఇంటిని శుభ్రం చేసుకుని, గుమ్మాలకు పసుపు రాసుకుని ,తోరణాలు కట్టుకుంటారు. ఈ శ్రావణమాసంలో శివుడిని అలాగే లక్ష్మీదేవిని బాగా కొలుస్తారు. సోమవారం రోజు శివునికి పూజలు చేసి ఉపవాసాలు కూడా ఉంటారు. శివునికి ఈ శ్రావణమాసం ఎంతో ప్రీతికరమైనది. కాబట్టి ఆయనకు ఈ శ్రావణమాసంలో పూజలు చేసి, ఉపవాసాలు ఉండడం ఆనవాయితీగా మారింది. ఈ శ్రావణమాసంలో ఆయనకు పూజలు నిర్వహిస్తూ, ఉపవాసాలు ఉండడం వలన ఆయన అనుగ్రహం తప్పక కలుగుతుందట. అలాగే ఈ మాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని కూడా పూజిస్తూ ఉంటారు. అదేవిధంగా శివుడు విగ్రహం చూసుకున్నట్లయితే ఆయనకు ఎటువంటి ఆభరణాలు ఉండవు.
ఆయనకు ఒళ్ళు అంతా బూడిద ,మెడలో నాగుపాము, నెత్తి పైన గంగా ఇలా ఉంటాడు. ఆయనకు ఇవే చాలా ఇష్టమైనవి గా చెప్తూ ఉంటారు. కాబట్టి మన ఇంట్లో ఈ శ్రావణమాసంలో ఈ వస్తువులు ఉండటం వలన ఆయన అనుగ్రహం తొందరగా కలుగుతుంది అని చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రులు, అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. రుద్రాక్ష ఈ రుద్రాక్ష అంటే చాలా ప్రీతికరమైనది. ఈ రుద్రాక్ష శివుడు కన్నీటితో పుట్టినది. అందుకే దీనిని చాలా పవిత్రంగా చూస్తారు. అందుకే ఈ రుద్రాక్షను ఇంట్లో ఉంచటం వలన ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వాళ్ళ ఆరోగ్యం కుదుటపడుతుంది. అదేవిధంగా ఇక ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. అని నమ్మకం, అలాగే శివునికి పూజ చేసేటప్పుడు ఆయన రత్నాల పాముని కూడా ఆరాధించాలి.
ఇలా ఆరాధించడం వలన, ఇంట్లో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోయి, సుఖ సంతోషాలతో గడుపుతారు. అదేవిధంగా బూడిద శివుడికి ఎంతో ప్రీతికరమైనది. ఈ బూడిద అంటే దీనిని భస్మం అంటారు. ఈ బస్మాని తీసుకువచ్చి మీరు పూజ చేసేటప్పుడు శివలింగంపై ఈ భస్మాన్ని చల్లుతూ పూజ చేసినట్లయితే ఆయన అనుగ్రహం తప్పక కలుగుతుంది. అలాగే ఈ భస్మం ఇంట్లో ఉండడం వలన ,ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు తులతూగుతాయి. ఇలా ఈ శ్రావణమాసంలో ఈ వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం వలన అన్ని శుభాలే ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఆయన అనుగ్రహం తప్పక కలుగుతుంది.