Sravana Masam : ఈ శ్రావణమాసంలో ఈ ఐదు మొక్కలు మీ ఇంట్లో ఉంచినట్లయితే… కుబేర్లు అవ్వడం తథ్యం… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sravana Masam : ఈ శ్రావణమాసంలో ఈ ఐదు మొక్కలు మీ ఇంట్లో ఉంచినట్లయితే… కుబేర్లు అవ్వడం తథ్యం…

 Authored By aruna | The Telugu News | Updated on :9 August 2022,6:00 am

Sravana Masam : ఈ శ్రావణమాసం ఈసారి జూలై నెల 29 అమావాస్య తదుపరి నుండి ప్రారంభమైంది. అయితే ఈ ఈ శ్రావణమాసం వచ్చింది అంటే ప్రతి ఇల్లు అలంకరణలతో నిండిపోతూ ఉంటుంది. అయితే ఈ శ్రావణమాసం ఎక్కువగా శివుని అలాగే లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు. శివుని సోమవారం నాడు పూజించి ఉపవాసాలు ఉంటూ ఉంటారు. ఈ శ్రావణమాసం శివుడికి ఎంతో ప్రత్యేకమైన మాసము అని అంటుంటారు. ఈ మాసంలో ఆయనకు పూజ చేసి ఉపవాసం ఉంటే తప్పక ఆయన అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా ఈ శ్రావణమాసంలో కొన్ని మొక్కలు ఇంట్లో ఉండడం వలన కుబేరులు అవుతారు అని చెప్తున్నారు. అయితే ఎలాంటి మొక్కలు ఉంచడం వలన మన గృహంలోకి లక్ష్మీదేవి వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం.. ఇంట్లో ఎన్నో రకాల మొక్కలు నాటుతూ ఉంటారు. ఆ మొక్కల వలన ఎంతో ప్రశాంతతను పొందుతూ ఉంటారు. అదేవిధంగా కొన్ని రకాల మొక్కలైతే మనం దేవుడి సన్నిధిలో ఉన్నామా అని అనిపిస్తుంది. అదేవిధంగా ఈ శ్రావణమాసంలో కొన్ని మొక్కలను ఇంట్లో ఉంచడం వలన కోటీశ్వరులు అవ్వడం మే కాకుండా కొన్ని గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయట. ఈ శ్రావణ మాసంలో తప్పక మీ ఇంట్లో ఉంచవలసిన మొక్కలు ఏంటో తెలుసుకుందాం.

1. జమ్మి మొక్క ఈ మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ జమ్మి ఆకులను శివుడి దగ్గర ప్రసాదంగా పెడతారు. అలాగే ఈ మొక్క ఇంటి ఆవరణలో ఉంచుకోవడం వలన శని దేవుడు మీ ఇంట్లో నాట్యం చేస్తాడు. 2. బిల్వ వృక్షం ఈ బిల్వ వృక్షం శివునికి ఎంతో ప్రీతికరమైన మొక్క అదే విధంగా దీని సువాసన కుబేరునికి ఎంతో ప్రీతికరమైనది. ఈ మొక్కను మీ ఇంట్లో ఉంచినట్లయితే మీ ఇల్లు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి మీ ఇంట అడుగుపెడుతుంది. 3. జిల్లేడు మొక్క ఈ మొక్క ఇంట్లో ఉంచినట్లయితే ఈ శ్రావణమాసంలో శివుడి అనుగ్రహం తప్పక కలుగుతుంది. అయితే ఈ మొక్కలలో చాలా రకాలు ఉంటాయి. అయితే ఈ మొక్కలలో తెల్ల జిల్లేడు అనే మొక్కని మాత్రమే మీ ఇంటి ఆవరణలో పెంచుకోవాలి. ఈ మొక్క వలన సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఈ జిల్లేడు మొక్క మీ జీవితాన్ని ఎంతో మెరుగుపరుస్తుంది. ఈ మొక్క సింపుల్గా ఎదుగుతుంది. ఈ మొక్క ఎంత సులువుగా పెరుగుతుందో. అలాగే మీ జీవితం కూడా అంతే సులువుగా ఎదుగుతుంది.

Sravana Masam Put These Plants In Your Home You Will Be Rich

Sravana Masam Put These Plants In Your Home You Will Be Rich

4. ఉమ్మెత్త మొక్క ఈ మొక్క ఎంతో ప్రత్యేకమైన మొక్క. ఈ మొక్క మీ ఇంట్లో ఉంచినట్లయితే శివుడు ప్రసన్నమై మీరు కోరుకున్న విధంగా మీ కోరికలను నెరవేరుస్తాడు. అదేవిధంగా మీకు ఉన్న ఇబ్బందులు కూడా తొలగిస్తాడు. 5. సంపంగి మొక్క ఈ శ్రావణమాసంలో ఈ మొక్క ఇంట్లో ఉంచినట్లయితే అన్ని శుభాలే జరుగుతాయి. ఈ మొక్క ఉండడం వలన అదృష్టం మీ తలుపు తడుతుంది. అయితే ఈ మొక్కను మీరు చిన్న కుండీలలో కూడా ఉంచవచ్చు. ఈ మొక్క ఉండడం వలన ధన ప్రాప్తి కలుగుతుంది. ఇలా ఈ శ్రావణమాసంలో ఈ ఐదు మొక్కలను మీ ఇంట్లో ఉంచడం వలన మీరు కుబేర్లు అవ్వడమే కాకుండా మీ అనారోగ్య సమస్యలు కూడా తొలిగిపోతాయి.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది