Taurus: ఆగస్టు నెలలో వృషభ రాశి వారికి ఊహించని ఫలితాలు…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Taurus: ఆగస్టు నెలలో వృషభ రాశి వారికి ఊహించని ఫలితాలు…!

Taurus : వృషభ రాశి వారి గోచార ఫలితాలు .. ఎలా ఉండబోతున్నాయి.. ఎవరు అవునన్నా కాదన్నా నూటికి నూరు శాతం జరగబోయేది ఇదే.. ఆగస్టు ఒకటి పౌర్ణమి తర్వాత నిజంగా అదృష్టం అనేది వెంట వస్తుంది. వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు పట్టిందల్లా బంగారమవుతుంది. కాబట్టి ఈ రాశి వారు ఆగస్టు ఒకటి పౌర్ణమి తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో ఎదుర్కోబోతున్నారు.. అలాగే మీ జీవితంలో మరింత అనుభూతిని సాధించడం కోసం మీరు చేయవలసిన దేవత […]

 Authored By aruna | The Telugu News | Updated on :31 July 2023,6:30 am

Taurus : వృషభ రాశి వారి గోచార ఫలితాలు .. ఎలా ఉండబోతున్నాయి.. ఎవరు అవునన్నా కాదన్నా నూటికి నూరు శాతం జరగబోయేది ఇదే.. ఆగస్టు ఒకటి పౌర్ణమి తర్వాత నిజంగా అదృష్టం అనేది వెంట వస్తుంది. వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు పట్టిందల్లా బంగారమవుతుంది. కాబట్టి ఈ రాశి వారు ఆగస్టు ఒకటి పౌర్ణమి తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో ఎదుర్కోబోతున్నారు.. అలాగే మీ జీవితంలో మరింత అనుభూతిని సాధించడం కోసం మీరు చేయవలసిన దేవత ఆరాధన తో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం వివరంగా తెలుసుకుందాం.. ఈ రాశికి చెందిన స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో ఆగస్టు ఒకటి పౌర్ణమి తర్వాత మీకు ప్రతి విషయంలో అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ మీరు విజయం సాధిస్తారో ఆ పనిని పూర్తి చేయడంలో ముందుంటారు. మీరు చేయవలసిన పని అది చిన్నదైనా పెద్దదైనా సరే దాన్ని విజయవంతంగా చేయడానికి మీకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి..

కానీ వాటిని ఎదిరించి మీరు ముందుకు వెళ్లడం అనేది జరుగుతుంది. ఈ ప్రయాణాల్లో మీకు ఎవరైనా కానీ ఎవరి సహాయం అందకపోయినా నా స్వయంకృషితో నేను సాధిస్తాను అని పట్టుదలతో మీరు అనుకున్న పనిని సాధించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రాశికి చెందినవారు ఎప్పటినుంచో ఆర్థిక ఇబ్బందుల బారిన పడి ఇబ్బందులు పడుతున్నట్లయితే అలాగే ఇదివరకు వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడి పెట్టి నష్టపోయి మానసికంగా బాధపడుతున్నట్లయితే కనుక ఈ సమయంలో మీకు ఆర్థికపరంగా ఎంతో అనుకూలమైన పరిస్థితి కనిపిస్తోంది. మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా మీకు ఆదాయం అనేది సొంతమవుతుంది.. మీ చిన్ననాటి స్నేహితులు కావచ్చు.. వారి ద్వారా మీకు లాభమే కలుగుతుంది. మంచి గుర్తింపు సాధించడం కోసం వాళ్ళు ఇచ్చే సలహాలు అనేవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. వాటిని ఆచరించడం వల్ల ఎన్నాళ్ళ నుంచి మీకున్న కోరిక నెరవేరుతుంది. జీవితంలో మనకి కొంతమంది వ్యక్తి పరిచయం అవ్వడం వల్ల మంచి జరుగుతుంది. అలాగే చెడు కూడా జరుగుతుంది.

Taurus signs in the month of August

Taurus signs in the month of August

కానీ మీకు మీ జీవితంలో ఆగస్టు ఒకటి పౌర్ణమి తర్వాత పరిచయమయ్యే వ్యక్తుల ద్వారా అన్ని శుభాలే జరుగుతాయి. శుభ ప్రయాణాలు చేస్తారు. అన్నింటిలోనూ శుభ శకునాలనేవి ఎదురవుతాయి. అలాగే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో పురుష సంతానం అనేది కలవడం జరుగుతుంది. రాజకీయ నాయకులకు ముఖ్యంగా ఒక శ్రీ కారణంగా మీరు రాజకీయపరంగా ముందుకు వెళ్లబోతున్నారు. ఆమె మీపై అధికారి కావచ్చు. లేదా మీ జీవిత భాగస్వామి కావచ్చు.. లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా కావచ్చు.. రాజకీయ రంగంలో మిమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తారు. ఇక దాంపత్య జీవితంలో మీ జీవిత భాగస్వామితో మీరు ఎంతో మధుర క్షణాలను గడపబోతున్నారు.. అయితే ప్రతి బుధవారం గణేశునికి దీపారాధన చేయండి.

అలాగే గ్రహ దోషాలు తొలగించుకోవడానికి మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మంగళవారం రోజు కానీ గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఆదివారం నాడు కానీ ఈ రోజుల్లో ఏదో ఒక రోజు తమలపాకులు పచ్చ కర్పూరం తీసుకొని దీపారాధన చేసిన తర్వాత దైవం సన్నిధిలో తమలపాకు ఉంచి దానిపైన పచ్చ కర్పూరం పెట్టి మరొక తమలపాకుని ఆ కర్పూరం పైన పెట్టండి. ఇలా రెండు తమలపాకుల కాడలు ఒకే వైపు వచ్చేలా చూసుకోండి. ఆ తర్వాత దాన్ని ఒక పొట్లల్లా కట్టి పూజా మందిరంలో పెట్టి దాని మీద చేయి పెట్టి మీ ఇంట్లో వాళ్ళ పేర్లు గోత్రాలు అన్ని చెప్పుకొని అలాగే మీరు ఏం జరగాలని కోరుకుంటున్నారో ఒక సంకల్పం చేసుకోండి. ఈ విధంగా చేయడం వలన మీకు వచ్చిన సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోయి సుఖసంతోషాలు చేకూరుతాయని చెప్పవచ్చు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది