Vomiting : మీకు ఉదయాన్నే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా… ఇవి ఏ వ్యాధులకు సంకేతమో తెలుసా…!!
ప్రధానాంశాలు:
Vomiting : మీకు ఉదయాన్నే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా... ఇవి ఏ వ్యాధులకు సంకేతమో తెలుసా...!!
Vomiting : ప్రస్తుత కాలంలో మనం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నాము. అయితే అనారోగ్య సమస్యలు అనేవి మొదలైతే మన శరీరం వెంటనే మనల్ని అలర్ట్ చేస్తుంది. ఇలా కొద్ది లక్షణాల ఆధారంగా ఆ సమస్యలను ముందుగానే మనం గుర్తించవచ్చు అని నిపుణులు అంటున్నారు. ఇలాంటి ఒక లక్షణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే మనలో కొందరికి వికారంగా అనిపిస్తుంది. అయితే ఈ లక్షణం గనక మీకు కనిపిస్తే మీ శరీరం మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఇంతకీ ఆ లక్షణాలు ఏమిటి.? అవి ఎటువంటి వ్యాధులకు సంకేతమో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
మానసిక సమస్యలతో ఇబ్బంది పడేవారిలో ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఏదైనా ఒక విషయం గురించి అధికంగా ఆలోచించిన మరియు ఆందోళన చెందిన అది మర్నింగ్ సిక్ నెస్ కు దారి తీస్తుంది అని చెబుతున్నారు. మీరు తరచుగా ఎక్కువ ఒత్తిడి మరియు ఆందోళనతో సతమతం అవుతూ ఉంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే వికారం లేక వాంతుల భావన కలుగుతుంది అని అంటున్నారు నిపుణులు. కావున ఈ సమస్య నుండి మీరు బయటపడాలి అంటే యోగ మెడిటేషన్ లాంటి వాటిని అలవాటు చేసుకుంటే చాలా మంచిది. ఇక లోబీపీతో ఇబ్బంది పడేవారిలో కూడా ఉదయం వికారంగా ఉంటుంది అని నిపుణులు అంటున్నారు.
అలాగే శరీరంలో బిపి తగ్గితే వాటితో పాటుగా మైకం కూడా వస్తుంది అని అంటున్నారు. అంతేకాక కొన్ని సందర్భాలలో అపస్మారక స్థితిలోకి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది అని అంటున్నారు. అయితే ఈ సమస్య నుండి మీరు బయటపడాలి అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే ఏదైనా తినాలి అని అంటున్నారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే వాంతులు మరియు వికారం లాంటి సమస్య గనక ఉన్నట్లయితే అది మైగ్రేన్ సమస్యగా భావించాలి అని అంటున్నారు నిపుణులు. అలాగే తీవ్రమైన తలనొప్పితో పాటుగా వికారం కూడా ఉన్నట్లయితే అది తప్పనిసరిగా మైగ్రేన్ కు లక్షణం అని అంటున్నారు. ఇక డిహైడ్రేషన్ కు కూడా తక్కువగా నీరు తాగటం ఒక కారణం అని అంటున్నారు. అంతేకాక రాత్రిపూట తగినన్ని నీళ్లు తాగకపోతే ఉదయాన్నే మైకం మరియు వికారం లాంటి భావన మీకు కలుగుతుంది…