Sarvartha Siddhi Yoga : సర్వార్థ సిద్ధి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం… కోటీశ్వరులు అవడం ఖాయం…!
ప్రధానాంశాలు:
Sarvartha Siddhi Yoga : సర్వార్థ సిద్ధి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం... కోటీశ్వరులు అవడం ఖాయం...!
Sarvartha Siddhi Yoga : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఖగోళంలో నిర్దిష్ట సమయంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తూ ఉంటాయి. ఇలా సంచారం చేస్తున్న సమయంలో కొన్ని రాశుల వారికి సానుకూల పరిణామాలు ఉంటే మరికొన్ని రాశుల వారికి ప్రతికూల పరిణామాలు ఉంటాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నెల 16వ తేదీ కీలకమైనది. ఎందుకంటే ఆ రోజు వృషభ రాశిలోకి చంద్రుడు ప్రవేశించగా అదే సమయంలో బృహస్పతి సంచారం చేసి గజకేసరి యోగాన్ని ఏర్పరుస్తున్నారు. అదేవిధంగా 18వ తేదీన సర్వార్థ సిద్ధి యోగం అమృత సిద్ధి అనే యోగాలు ఏర్పడుతున్నాయి. అయితే ఈ యోగాలు ఎంతో శక్తివంతమైన యోగాలు కావడంతో వీటివలన కొన్ని రాశుల వారు లాభాలను పొందుతారు. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
Sarvartha Siddhi Yoga : కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి శక్తివంతమైన యోగాల కారణంగా అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. కర్కాటక రాశి జాతకుల కెరియర్లో కొన్ని మార్పులు జరుగుతాయి. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే నూతన ప్రాజెక్టులు లభించడంతో పాటు ప్రమోషన్లు కూడా వస్తాయి. ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగి ఆర్థికంగా స్థిరపడతారు.
ధనస్సు రాశి : ధనస్సు రాశి జాతకులకు సర్వార్థ సిద్ధి యోగం అమృత సిద్ధి యోగం కారణంగా అదృష్టం పట్టపోతుంది. ఇక ఈ రాశి వారు ఈ సమయంలో ఏ పని మొదలు పెట్టిన అందులో విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుంచి ఈ సమయంలో బయట పడతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకున్న వారికి ఇది మంచి నిర్ణయం. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది.
వృషభ రాశి : వృషభ రాశి వారు శక్తివంతమైన యోగాల కారణంగా ఆర్థిక లాభాలను ఆర్జిస్తారు. అలాగే వృత్తిపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి. అదేవిధంగా ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
యోగాల కారణంగా కొందరికి సానుకూల ఫలితాలు ఉంటే మరికొందరికి ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. వీటికి కారణం వారు చేసుకున్న కర్మలు. దీనికి పరిహారంగా కార్తీక మాసం కావడంతో శివుడిని శని దేవుడిని పూజించడం వలన వారు చేసుకున్న కర్మల బలం తగ్గుతుంది. అయితే ఇలా తగ్గడానికి గురువును సేవించాలి. జాతకంలో గురు బలం ఉండడం వల్ల ఆర్థికంగా స్థిరపడతారు. అంతేకాకుండా ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. ఇక జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.