Sunday : ఆదివారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనులు ఇవే… ఒకవేళ చేస్తే ఇక అంతే…!
Sunday : ఈరోజు మనం ఆదివారంనాడు చేయవలసిన పనులు ఏంటి.. చేయకూడని పనులు ఏంటి.. అనే విషయాలని తెలుసుకుందాం.. సమస్త ప్రాణకోటికి ఆధార భూతమైన వాడు సూర్యభగవానుడు. సూర్యుడు అధిపతిగా ఉన్న రోజు ఆదివారం మనకి సూర్యాష్టకం అనేది ఉంది. అందులో రెండు స్లోకాలు తెలుపబడ్డాయి. అందులో మొదటిది అమీషా మధుపానం జన్మజన్మ దరిద్రతా: ఆదివారం నాడు మాంసం తిన్న మద్యం సేవించిన ఏడు జన్మల వరకు రోగస్తులు అవుతారు. జన్మజన్మలకి దారిద్రాన్ని అనుభవిస్తారు. అందుకోసమే ఆదివారం నాడు మద్యం సేవించడం కానీ మాంసాహారం తినడం కానీ చేయకూడదు.
ఆదివారము నాడు సంభోగము మధ్యము మాంసం స్వీకరించడం తలకి నూనె రాసుకుని స్నానం చేయడం లాంటి పనులు చేయని వారికి శోకం అనేది ఉండదు. వ్యాధులు అనేవి రావు. అసలు దారిద్రం అనేదే ఉండదు. ఇది రెండవ శ్లోకం యొక్క అర్థం. ఇప్పుడు మనం ఆదివారం నాడు చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం. సూర్యుడు ఆధిపత్యం వహించిన ఆదివారం రోజున ఈ విధమైన పనులు మాత్రమే చేయడం వలన మనం తలపెట్టిన కార్యాలన్నింటిలో విజయాలను పొందుతాము. ముఖ్యంగా ఆదివారం నాడు ఉన్నత పదవులు చేపట్టడం ఉద్యోగారీత్యా ఉన్నటువంటి సమస్యలను పై అధికారులకు చెప్పడం ప్రభుత్వ కార్యకలాపాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు, కుటుంబ పరమైన సమస్య లు, బంగారం కొనుగోలు చేయడం కోర్టు సమస్యలు వ్యాపార సమగ్రని కొనుగోలు చేయడం వ్యవసాయ సామాగ్రిని కొనుగోలు చేయడం లాంటి పనులను చేపట్టడం వలన సకాలంలో అన్ని పనులను చేయగలుగుతారు.
అలాగే ఆదివారం నాడు నూతన వ్యాపారం ను ప్రారంభించడం వివాహ శుభకార్యాలు వంటివి జరుపుకోవడం పడమటి దిక్కున ప్రయాణాలు చేయడం వంటి పనులను ప్రారంభించకుండా ఉంటే చాలా శ్రేయస్కరం. ఉద్యోగ వ్యాపార కుటుంబ సమస్యల వంటి వాటికీ పరిష్కారం కావాలంటే ఆదివారం నాడు రామాయణం చదవడం వల్ల పరిష్కారం పొందుతారు…