Akshaya Tritiya : అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేని వారు ఇదొక్కటి తెచ్చుకుంటే చాలు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Akshaya Tritiya : అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేని వారు ఇదొక్కటి తెచ్చుకుంటే చాలు…!!

Akshaya Tritiya : అక్షయ తృతీయ నాడు బంగారం కొని ఆ బంగారంతో లక్ష్మీదేవిని ఆరాధించాలి అని చెప్తూ ఉంటారు. మరి అక్షయ తృతీయ నాడు బంగారం అందరూ కొనగలరా కొనలేనివారు లక్ష్మీదేవిని ఆరాధించినంత పుణ్యం ఏ విధంగా సంపాదించాలి. అక్షయ తృతీయనాడు సాధారణంగా ఎటువంటి పురాణాల ప్రకారం అక్షయ తృతీయ గురించి ఏం చెప్తున్నారు? మనందరం అక్షయ తృతీయనాడు పాటించాల్సినటువంటి పూజా విధానం గురించి చేయాల్సినటువంటి పనుల గురించి లక్ష్మీ కటాక్షం కలగాలంటే అక్షయ తృతీయ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :22 April 2023,7:00 am

Akshaya Tritiya : అక్షయ తృతీయ నాడు బంగారం కొని ఆ బంగారంతో లక్ష్మీదేవిని ఆరాధించాలి అని చెప్తూ ఉంటారు. మరి అక్షయ తృతీయ నాడు బంగారం అందరూ కొనగలరా కొనలేనివారు లక్ష్మీదేవిని ఆరాధించినంత పుణ్యం ఏ విధంగా సంపాదించాలి. అక్షయ తృతీయనాడు సాధారణంగా ఎటువంటి పురాణాల ప్రకారం అక్షయ తృతీయ గురించి ఏం చెప్తున్నారు? మనందరం అక్షయ తృతీయనాడు పాటించాల్సినటువంటి పూజా విధానం గురించి చేయాల్సినటువంటి పనుల గురించి లక్ష్మీ కటాక్షం కలగాలంటే అక్షయ తృతీయ ఏం చేయాలి అనే అంశం గురించి తెలుసుకుందాం. మన దేశంలో సంక్రాంతి మొదలు ప్రతి నెలలో ప్రతి వారంలో ఏదో ఒక విశిష్టత ఉంటూనే ఉంటుంది. అలాంటి విశిష్టత కలిగిన ఎన్నో పండుగల్లో ఈ అక్షయ తృతీయ కూడా ఒకటి మన పురాణాల ప్రకారం అక్షయ తృతీయకి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

Akshaya Tritiya 2022: Date, Puja Time, Importance, Significance in India

ఇది వైశాఖమాసంలో శుద్ధ తదియ నడ వస్తుంది. పరమశివుని అనుగ్రహంతో కుబేరుడు సిరిసంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజు ఈ అక్షయ తృతీయ రోజు అంటారు. ఈ రోజున చేసేటువంటి ప్రతి కార్యం కూడా విజయవంతమవుతుందని దాని యొక్క ఫలితం తిరిగి మనకి 100 రెట్ల రూపంలో అందుతుందని చెప్తారు. అంతేకాదు అక్షయ తృతీయ గురించినటువంటి ప్రస్తావన నారద పురాణంలో కూడా ఉంటుంది జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన చతుర్థి వచ్చింది. ఈరోజున మీరు బంగారం కొనుగోలు చేయగలిగిన వారు చేయండి. ఆ బంగారంతో మీరు అమ్మవారికి పూజ చేసుకొని మేలు కలుగుతుంది. మరి కొలలేని వారు ఏం చేయొచ్చు. అక్షయ తృతీయ నాడు కచ్చితంగా బంగారం కొనాలి అంటే కానీ కాదు. బంగారంతో పూజ చేసినటువంటి ఫలితం మీరు లక్ష్మీ కుబేర వ్రతం చేస్తే పొందుతారు. లక్ష్మీ కుబేర వ్రతం ఎంతో విశిష్టత కలిగినటువంటి వ్రతం కుబేరున్ని లక్ష్మీదేవిని ఆరాధిస్తే మీకు సకల సంపదలు కలుగుతాయి.

Those who cannot buy gold on the day of Akshaya Tritiya should get this one

Those who cannot buy gold on the day of Akshaya Tritiya should get this one

మరి లక్ష్మీ కుబేర ఎవరు చేయాలి? అంటే లక్ష్మీ కుబేర వ్రతాన్ని అక్షయ తృతీయనాడు ఎవరైతే ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక కష్టాలనుంచి బయటపడాలి అనుకుంటున్నారో వారు చేయొచ్చు. ఈనాడు ముహూర్తం అంటూ ఏమీ ఉండదు అక్షయ తృతీయ నాడు ప్రతిక్షణం కూడా మంచి ముహూర్తమే ప్రతిక్షణం సుముహూర్తమే కాబట్టి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడు కుదిరితే అప్పుడు లక్ష్మి కుబేర వ్రతం చేసుకోవచ్చు. అలాగే ధాన్యాలు, బియ్యం కాని పప్పు దినుసులు కానీ ఏవైనా సరే మీరు ఈ అక్షయ తృతీయ నన్ను తెచ్చుకోవచ్చు. అందుబాటులో ఉన్నవారు శంఖాన్ని తెచ్చుకోవటం లేదంటే కామదేవు చిత్రపటాన్ని కొనుగోలు చేసి మీ ఇంట్లో ఉంచుకోవటం అలాగే శ్రీ మహాలక్ష్మి దేవికి ఇష్టమైనటువంటి లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు చిట్టి గాజులు మార్కెట్లో పూజా స్టోర్స్ లో దొరుకుతూ ఉంటాయి. ఇటువంటి వాటిని మీరు గనక కొని తెచ్చుకొని ఇంట్లో మీ పూజ విధానంలో ఉపయోగించుకుంటే అక్షయ తృతీయ నాడు బంగారంతో శ్రీ మహాలక్ష్మి దేవిని ఆరాధించిన ఫలితం దక్కుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది