Vastu Shastra : మీ కుటుంబంలో తరచూ సమస్యలు వస్తున్నాయా.. అయితే ఇలా చెక్ పెట్టండి!
Vastu Shastra : మన హిందూ సాంప్రదాయాల ప్రకారం వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనం ఉండే ఇంటి నుంచి మన కష్ట సుఖాలు, లాభ నష్టాల వరకు ఇలా ప్రతీ దానితో వాస్తు శాస్త్రం ముడిపడి ఉంది. అలాగే మన కుటుంబంపై, కుటుంబంలోని సభ్యుల సంతోషం, ఆనందం, కష్టాలు, నష్టాలు, సమస్యలు ఇలా అన్నింటిపై వాస్తు ప్రభావం ఉంటుంది. అయితే మన ఇంట్లో ఎలాంటి సమస్యలు తలెత్తినా, చెడు సంఘటనలు జరిగినా ముందుగా మనం వెళ్లి కలిసేది వాస్తు శాస్త్ర నిపుణుడినే. మనం ఉన్న ఇంటిలో ఏదైనా వాస్తు దోషం ఉందా.. అందువల్లే మనకు సమస్యలు వస్తున్నాయోమే అని తెలుసుకుంటాం. ఒకవేళ వాటి వల్లే సమస్యలు ఉన్నాయని తెలిస్తే… వెంటనే వాటిని సరి చేసుకుంటాం. అయితే ఇంట్లో కొన్ని వస్తువులను కొన్ని స్థలాల్లో పెట్టడం వల్ల కూడా కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతాయని ప్రముఖ వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఇంట్లో గొడవలు జరగకుండా ఉండి…
మనం సంతోషంగా ఉండాలంటే వాస్తు ప్రకారం మన ఇంట్లో కొన్ని వస్తువులను ఎలా ఉంచుకోవాలో చెబుతున్నారు.వాస్తు శాస్త్రం ప్రకారం మనం ప్రతిరోజూ నిద్ర పోయే మంచం ఎప్పుడూ నైరుతి దిశలోనే ఉండేలా చూసుకోవాలి. అలాగే నిద్రపోయే సమయంలో మన తల దక్షిణ దిశవైపు పెట్టి పడుకోవాలి. అలా దక్షిణం వైపు తల ఉంచి పడుకోవడం వల్ల మన శరీరంలో శక్తి ప్రవాహానికి అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా మనం లేచి చూడగానే మన ఇష్ట దైవం కనిపించేలా మన ముందు దేవుడి విగ్రహాన్ని లేదా చిత్ర పటాన్ని పెట్టుకోవాలి. అలాగే వీలయినంత వరకూ ప్రతిరోజూ పూజలు చేస్తే.. ఇంట్లో గొడవలు తగ్గి చాలా సంతోషంగా ఉంటారని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంటి నైరుతి వైపు ఎలాంటి తలుపులు, కిటికీలు ఉంచకూడదట. అలా ఉంచడం వల్ల దొంగతనం లేదా అగ్ని ప్రమాదం జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయట.

Vastu Shastra tips for solve family issues
ఒక వేళ ఇప్పటికే మన ఇంట్లో కిటికీలు, తలుపులు నైరుతి వైపు ఉంటే ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రతీ గురువారం ఉదయం ఆవుకు బెల్లం, పప్పు, సెనగలు, రొట్టెల వంటివి తినిపించడం వల్ల ఇలాంటి దోషాలు తొలగిపోతాయి. అంతే కాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంటి ముఖ ద్వారం వద్ద ఎలాంటి తీగల చెట్లు, ముల్ల చెట్లను పెంచకూడదు. అలాగే మురికి నీరు ఇంటి ముందు నుంచి ప్రవహించకుండా చూసుకోవాలి. ఇలా ఉండటం ద్వారా ఆ ఇంట్లో నివసించే వారు చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందట. అయితే దీని నుంచి ఉపశమనం పొందాలనుకుంటే మన ఇంటి ముఖ ద్వారం వద్ద వినాయకుడి ప్రతిమను ఉంచాలి. అలా చేయడం వల్ల దోషాలు తొలగిపోయి కుటుంబ సభ్యులంతా సుఖసంతోషాలతో జీవిస్తారట.