మీరు పుట్టిన తిథి ప్రకారం ఏ దేవుణ్ణి పూజించాలో తెలుసా ?
సనాతన ధర్మంలో మనిషి పుట్టకకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. పుట్టిన తిథి, నక్షత్రం సమయం ఆధారంగా జాతకాలను రాస్తారు. దానితో భవిష్యత్ జీవిత గమనాన్ని అంచనావేస్తారు. జ్యోతిషం అనేది ఒక జ్ఞానజ్యోతిగా జీవితాన్ని జ్ఞానం వైపు ప్రయాణింప చేస్తుంది. ఇక ప్రస్తుతం ఆయా తిథులలో అంటే శుక్ల పక్షంలో పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు పుట్టిన వారు ఏ దేవత లేదా దేవుడిని ఆరాధించాలి. ఏ మంత్రాన్ని జపించాలో తెలుసుకుందాం…
శుక్ల పాడ్యమి నాడు పుట్టిన వారు “చిత్రా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం అం “చిత్రే” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల విదియ నాడు పుట్టిన వారు “జ్వాలామాలినీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఔం “జ్వాలామాలినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల తదియ నాడు పు
ట్టిన వారు “సర్వమంగళా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఓం “సర్వమంగళా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల చవితి నాడు పుట్టిన వారు “విజయా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఐం “విజయా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల పంచమినాడు పుట్టిన వారు “నీలపతాకా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఏం “నీలాపతాకా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల షష్ఠి నాడు పుట్టిన వారు “నిత్యా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ౡం “నిత్యా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల సప్తమి నాడు పుట్టిన వారు “కులసుందరీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఌం “కులసుందరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల అష్టమి నాడు పుట్టిన వారు “త్వరితా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ౠం “త్వరితా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల నవమి నాడు పుట్టిన వారు “శివదూతీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఋం “శివదూతీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల దశమి నాడు పుట్టిన వారు “మహావజ్రేశ్వరీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఊం “మహావజ్రేశ్వరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల ఏకాదశి నాడు పుట్టిన వారు “వహ్నివాసినీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఉం “వహ్నివాసినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల ద్వాదశినాడు పుట్టిన వారు “బేరుండా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఈం “బేరుండా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల త్రయోదశి నాడు పుట్టిన వారు “నిత్యక్లిన్నా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఇం “నిత్యక్లిన్నా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
శుక్ల చతుర్ధశి నాడు పుట్టిన వారు “భగమాలినీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఆం “భగమాలినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
పౌర్ణమి నాడు పుట్టిన వారు “కామేశ్వరీదేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం అం “కామేశ్వరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.