
TTD : శ్రీవారి పాదాలకు ఇంతటి విశిష్ట ఉందా... ఈ అద్భుతం గురించి తప్పక తెలుసుకోండి...?
TTD : భారతదేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాలలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుమల తిరుపతి క్షేత్రం కూడా ఒకటి. అయితే ఈ తిరుమల తిరుపతిలో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ప్రతిరోజు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇక్కడ భక్తులు రెండు మార్గాల ద్వారా శ్రీవారి దర్శనానికి వెళుతుంటారు. దానిలో ఒకటి అలిపిరి మార్గం. ఇక ఈ అలిపిరికి మార్గం గుండా వెళ్లేటప్పుడు శ్రీవారి పాదాలను దర్శించుకోవచ్చు. మరి అలిపిరి దగ్గర శ్రీవారి పాదాలు ఎలా వచ్చాయి అనే సందేహం అందరిలోనూ ఉంది. అలిపిరి ప్రదేశంలో గల తలయేరు గుంటు దగ్గర కనిపించే పాదాలని శ్రీపాదములుగా పిలుస్తుంటారు. కొండమీద స్వామి వారి కోసం నిలిచిన మొదటి పౌరుడు తిరుమలనంబి అతను రామానుచార్యులకు రామాయణ రహస్యాలను విప్పి చెప్పింది ఇక్కడే. కొండ నుంచి నంబి గోవిందరాజ పటాల నుంచి శ్రీమద్ రామానుజులు ఈ ప్రదేశానికి చేరుకుని గోఆరాధన చేసేవారట. దీనివల్ల స్వామివారి దర్శనం పొద్దున సాయంత్రం మాత్రమే అవుతుందని బాధపడేవారు. ఇదే సమయంలో వెంకటేశ్వర స్వామి ఆయన కలలో కనిపించి నా పాదాలను అలిపిరి దగ్గర ఉంచుతాను నీవు మధ్యాహ్నం కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చని అన్నారు.
అందుకే అలిపిరిలో శ్రీవారి పాదాలు కనిపిస్తాయి. ఆ పాదాలు తిరుమల నంబి గొప్పతనం వల్లే వచ్చాయి. కాలినడక మార్గంలో వెళ్లే వారికి అలిపిరి ప్రదేశంలో కనిపించే మండపం పరాల మండపం. దీనినే పాదాల మండపం అని కూడా అంటారు.అయితే మన తెలుగువారికి శ్రావణ శనివారం అనేది చాలా ముఖ్యమైనది. అందుకే ఆ రోజున ఉపవాసం ఉండడం, పిండి తాళికలు వేయడం వంటివి సాంప్రదాయంగా వస్తున్నాయి. అలాగే కంచి ప్రాంతంలోని హరిజన ఇంటిలో పాదముద్రలు పడతాయి. ఆ పాదముద్రలని కొలత వేసి శ్రీవారికి చర్మంతో చెప్పులు కుడతారు. శ్రీకాళహస్తి నుంచి ఒకరు నుండి ఒకరు శ్రీవారి చొప్పులను నెత్తిన పెట్టుకొని ఊరేగుతూ వచ్చి అలిపిరిలో పూజ చేసి పాదాల ముద్రలను పూజా మందిరిలో పెడతారు. ఈ మండపంలోని పాదరక్షలు అరిగిపోతాయి కారణం ఏమిటి అంటే తన భక్తులు సమర్పించిన ఈ పాదరక్షలను ధరించి స్వామి వారు కొండ దిగి వస్తారట. అలివేలు మంగమ్మ దగ్గరకు వెళ్లి తిరిగి కొండెక్కే సమయంలో మరల పాదరక్షకలను ఇక్కడే వదిలి వెళ్తారని పురాణాల్లో చెప్పబడుతుంది. శ్రీవారి బంగారు పాదాలు ఎల్లప్పుడూ తులసి పుష్పాలతో నిండి ఉంటాయి.
TTD : శ్రీవారి పాదాలకు ఇంతటి విశిష్ట ఉందా… ఈ అద్భుతం గురించి తప్పక తెలుసుకోండి…?
ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు తులసి లేకుండా శ్రీవారి బంగారు పాదాలను దర్శించుకోవచ్చు. శుక్రవారం అభిషేకానికి ముందు బంగారు పాదాల కవచాలను పక్కకు తీసి స్నాన పీఠంపై ఉంచి ఆకాశగంగ తీర్థాలతో అభిషేకం చేయిస్తారు. అభిషేక అనంతరం నిజపాద దర్శనం పేరిట భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అది శ్రీవారి పాదాలకు ఉన్న విలువ. అందుకే శ్రీనివాసుడు తన చరములే భక్తులకు శరణులు అంటూ కుడిచేతిని పాదాల వైపు చూపి దర్శించుకోని తరించమంటారు. ఆయన తను ఉన్నాను అని గుర్తించడానికి పాదాలను విశేషంగా చూపిస్తాడు. శ్రీవారి పాదాలకు ఇంతటి విశిష్టం ఉంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.