ugadi festival 2021 : ఉగాది పచ్చడి తినేటప్పుడు ఈ శ్లోకం చదివాలి !
ugadi festival 2021 ఉగాది.. తెలుగు వారి మొదటి పండుగ. షడ్రుచుల ఉగాది పచ్చడి ఈ పండుగ ప్రత్యేకత. అయితే ప్రాతఃకాలంలో స్నానం, దేవుడి ఆరాధన చేసి దేవుడికి ఉగాది పచ్చడిని నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం కింది ఈ శ్లోకాన్ని చదువుకొని ఉగాది పచ్చడి సేవనం చేయాలి..
– ‘‘త్వామష్ఠ శోక నరాభీష్ట, మధుమాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మామశోకం సదాకురు’
– ‘త్వామష్ఠ శోక నరాభీష్ట, మధుమాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మామశోకం సదాకురు’’
– ఇలా ఈ శ్లోకాన్ని చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రంలో పేర్కొనబడింది. చైత్రం అంటే మధుమాసంలో వచ్చే శోక బాధలను మన దగ్గరకు రాకుండా చేయటానికి.. బాధలు లేకుండా చూడాలని దేవుడిని కోరటమే ఆ శ్లోకం అర్థం. ఈ పండగకు మాత్రమే ప్రత్యేకంగా తినేది ఈ ఉగాది పచ్చడి.
ugadi festival 2021
ugadi festival 2021 : ఉగాది పచ్చడిలో వాడే పదార్థాలు
ఉగాది పచ్చడిలో ఆయా ప్రాంతాలలో స్వల్ప మార్పులు ఉన్న ఎక్కువమంది చేసే పచ్చడి పద్ధతి లో …. కొత్త చింతపండు, బెల్లం, మామిడి పిందెలు, వేపపువ్వు, మిరియాలు లేదా కారం లేదా పచ్చిమిర్చి, అరటిపండుతో పచ్చడి తయారు చేస్తారు. ఇది షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులూ జీవితంలోని బాధ, సంతోషం, ఉత్సాహం, నేర్పు, సహనం, సవాళ్లకు సంకేతాలు. సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలనూ ఒకేలా స్వీకరించాలన్న సందేశాన్ని చెప్పకనే చెబుతుందీ ఉగాది పచ్చడి. ఇలా నింబకుసుమభక్షణం చేయడం వల్ల ఆరోగ్యం, భగవదానుగ్రహం కలుగుతుంది. సర్వేజనాసుఖినోభవంతు.