Peacock Feather : నెమలి ఈకలతో అంత లాభమా.. అందుకే ఇంట్లో పెట్టుకోవాలా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Peacock Feather : నెమలి ఈకలతో అంత లాభమా.. అందుకే ఇంట్లో పెట్టుకోవాలా..!

Peacock feather : ప్రతీ కుటుంబంలో సమస్యలు వస్తూనే ఉంటాయి. అయితే వారు వాటిని దాటుకొని ముందుకెళ్లడమే జీవిత పరమార్థం. కష్టాలు, కన్నీళ్లు… ముఖ్యంగా వీటికి ఆర్థిక సమస్యలే ఎక్కువ కారణం అవుతాయి. అయితే అప్పుడప్పుడూ సమస్యలు వస్తే పర్లేదు కానీ… తరచుగా ఇంట్లో సమస్యలు వస్తే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. సమస్యలు తీర్చమంటూ స్వామీజీల వద్దకు వెళ్లేకంటే మీ కష్టాలను పోగొట్టే కొన్ని పూజలు చేయడం చాలా మంచిదని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. జీవితంలో […]

 Authored By pavan | The Telugu News | Updated on :19 February 2022,2:30 pm

Peacock feather : ప్రతీ కుటుంబంలో సమస్యలు వస్తూనే ఉంటాయి. అయితే వారు వాటిని దాటుకొని ముందుకెళ్లడమే జీవిత పరమార్థం. కష్టాలు, కన్నీళ్లు… ముఖ్యంగా వీటికి ఆర్థిక సమస్యలే ఎక్కువ కారణం అవుతాయి. అయితే అప్పుడప్పుడూ సమస్యలు వస్తే పర్లేదు కానీ… తరచుగా ఇంట్లో సమస్యలు వస్తే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. సమస్యలు తీర్చమంటూ స్వామీజీల వద్దకు వెళ్లేకంటే మీ కష్టాలను పోగొట్టే కొన్ని పూజలు చేయడం చాలా మంచిదని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. జీవితంలో ఎదురయ్యే ప్రతీ సమస్యను ఎదుర్కోవటానికి చాలా మంది అనేక రకాల పూజలు, వాస్తు దోషాలు చేయిస్తూ ఉంటారు. కానీ కష్టమొచ్చిన ప్రతీ సారి వారి దగ్గరకు, వీరి దగ్గరకు వెళ్లకండి. మరీ సమస్య తీవ్రం అయితేనే వెళ్లండి. అప్పటి వరకు ఇంట్లోనే మేం చెప్పబోయే నెమలి ఈకలతో సమస్యలను పరిష్కరించుకోండి.

హిందూ సంప్రదాయాల ప్రకారం నెమలికి, నెమలి పింఛానికి, ఈకలకు చాలా ప్రాముఖ్యత ఉంది. నెమలిని దేవుడిగా పూజించడమే కాకుండా మన జాతీయ పక్షికి చిహ్నంగా కూడా భావిస్తారు. పురాతన కాలం నుండి నెమలి ఈకలను చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. శ్రీ కృష్ణ పరమాత్ముడే నెమలి ఈకలను తన తలపై పెట్టుకున్నాడు. నెమలి ఈకలను ఇంటిలో ఉంచుకోవటం వల్ల అనేక రకాల దోషాలు తొలగిపోతాయని నమ్మకం. మన పూర్వీకులు కూడా ఇంట్లో కచ్చితంగా నెమలి ఈకలను పెట్టుకునేవారు. ఇప్పుడు కాస్త అది తగ్గినపోయింది. కానీ వాటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందుకే మీరు కూడా కొన్ని నెమలి ఈకలను తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి. అలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు కచ్చితంగా దూరం అవుతాయి.భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు వస్తుంటే… ఈ నెమలి ఈకలను బెడ్ రూంలోని తూర్పు లేదా ఉత్తరం వైపు ఉన్న గోడకు పెట్టుకోవాలంట. అలా నెమలి ఈకలను పెట్టడం వల్ల దాంపత్య జీవితానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయంట.

using peacok feathers for good wealth

using peacok feathers for good wealth

వారిద్దరి మధ్య ప్రేమ పెరిగి అన్యోన్యంగా జీవిస్తారంట. అంతే కాదండోయ్ జాతక దోషాలు ఉన్న వారు బెడ్ రూమ్ లోని పశ్చిమ దిశలో ఉన్న గోడపై నెమలి ఈకలను పెట్టుకోవాలంట. ఇలా చేయడం వల్ల వారి జాతక దోషాలు పోయి.. అదృష్టం కలిసి వస్తుందట. అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడే వారు ఇంట్లోనే ఆగ్నేయ దిశలో నెమలి ఈకలను ఉంచుకోవాలట. ఇలా పెట్టుకుంటే ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుందట. నెమలి ఈకలను పూజ గదిలో పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులు జీవిస్తారు. అయితే తరచూ ఇంట్లో సమస్యలు వచ్చే వారు మాత్రం ఆదు నెమలి ఈకలను పూజా మందిరంలో పెట్టుకొని 21 రోజులు పూజిచాలట. చివరి రోజు ఆ నెమలి ఈకలను ఇంట్లోని అల్మారాలో ఉంచుకోవాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో సమస్యలు తొలగిపోతాయి.

Also read

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది