Usiri Chettu : ఉసిరి చెట్టు యొక్క మహత్యం విన్నా లేక చదివిన 1000 అశ్వమేధ యాగాలు చేసిన మహా పుణ్యఫలం లభిస్తుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Usiri Chettu : ఉసిరి చెట్టు యొక్క మహత్యం విన్నా లేక చదివిన 1000 అశ్వమేధ యాగాలు చేసిన మహా పుణ్యఫలం లభిస్తుంది…!

Usiri Chettu : సాధారణంగా ఏ వృక్షానికి లేనంత ప్రాధాన్యతని ఈ కార్తీకమాసంలో ఉసిరి చెట్టుకి ఇస్తారు. ఉసిరికాయతో దీపాన్ని వెలిగించిన.. ఉసిరి చెట్టు కింద భోజనం చేసిన ఉసిరి చెట్టును పూజించే దీపాలు వెలిగించిన ఈ కార్తీకమాసంలో ఎంతో మేలు కలుగుతుంది అంటారు. అయితే ఉసిరి చెట్టుకు మాత్రమే ఇంతటి మహత్యం ఎందుకు? ఉసిరి చెట్టు గురించి మన పురాణాల్లో ఏం చెప్పారు. ఉసిరి చెట్టు మహత్యం విన్నా చదివినా సరే 1000 అశ్వమేధ యాగాలు […]

 Authored By jyothi | The Telugu News | Updated on :20 December 2023,7:00 am

ప్రధానాంశాలు:

  •  Usiri Chettu : ఉసిరి చెట్టు యొక్క మహత్యం విన్నా లేక చదివిన 1000 అశ్వమేధ యాగాలు చేసిన మహా పుణ్యఫలం లభిస్తుంది...!

Usiri Chettu : సాధారణంగా ఏ వృక్షానికి లేనంత ప్రాధాన్యతని ఈ కార్తీకమాసంలో ఉసిరి చెట్టుకి ఇస్తారు. ఉసిరికాయతో దీపాన్ని వెలిగించిన.. ఉసిరి చెట్టు కింద భోజనం చేసిన ఉసిరి చెట్టును పూజించే దీపాలు వెలిగించిన ఈ కార్తీకమాసంలో ఎంతో మేలు కలుగుతుంది అంటారు. అయితే ఉసిరి చెట్టుకు మాత్రమే ఇంతటి మహత్యం ఎందుకు? ఉసిరి చెట్టు గురించి మన పురాణాల్లో ఏం చెప్పారు. ఉసిరి చెట్టు మహత్యం విన్నా చదివినా సరే 1000 అశ్వమేధ యాగాలు చేసినంత మహా పుణ్యం కలుగుతుంది అంటారు. ఉసిరి చెట్టుకి ఎందుకింత మహత్యం ఉంది. ఉసిరి చెట్టు గురించిన ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అటువంటి విషయాలని మీకు తెలియ పరచడం జరుగుతుంది. ఉసిరి చెట్టు గురించి తెలుసుకుంటే జన్మజన్మల పాపాలు పటాపంచలవుతాయి అంటారు. అంతేకాదు మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి అటువంటి ఉసిరి చెట్టు మహిమ గురించి తెలిస్తే ఎవరైనా తప్పక ఆశ్చర్యపోతారు. అసలు ఏ వృక్షానికి లేనంత మహిమ అంతటి ప్రాధాన్యత ఈ ఉసిరి చెట్టుకే ఎందుకు.? ఉసిరి చెట్టు మూలంలో విష్ణుమూర్తి, కాండంలో రుద్రుడు, పై భాగంలో బ్రహ్మదేవుడు, కొమ్మల్లో సూర్యుడు, ఉప శాఖల్లో సకల దేవతలు ఉంటాయని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఉసిరికి సంబంధించినటువంటి ప్రతి భాగము ఎంతో ముఖ్యమైనది అంటారు. కార్తీక మాసంలో ఉసిరికాయపై ఒత్తులు వేసి దీపం వెలిగిస్తారు.

ఈ దీపం కార్తీక దామోదరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి దీపం.. అంతేకాదు ఉసిరి చెట్టు ఉన్నటువంటి పరిసర ప్రాంతంలో గాలి కూడా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది? ఉసిరి చెట్టు ఇంట్లో ఉంటే ఏమైనా వాస్తు దోషాలు ఉంటే అవన్నీ ఇట్టే తొలగిపోతాయి. అంతేకాదు.. ఎవరింట్లో అయితే ఉసిరి చెట్టు ఉంటుందో ఆ ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి. దుష్టశక్తుల్ని ఇంట్లోకి ప్రవేశించకుండా కాపాడేటువంటి శక్తి ఈ ఉసిరి చెట్టుకుంటుంది.ఉసిరి తిన్న ఉసిరిని ఆరాధించిన ఉసిరి దీపం వెలిగించిన సరే ఈ యమదూతల నుంచి మనం మనల్ని కాపాడుకోవచ్చు.. ప్రతిరోజు ఉసిరిని తినటం ఉసిరి దీపాలని వెలిగించటం ఉసిరిని దానం ఇవ్వటం ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయడం చేస్తే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఈ కార్తీకమాసంలో ఉసిరి చెట్టును పూజించి దీపాలను పెడితే మీకు సరిపోతుంది. అనేక పుణ్యాలు వస్తాయి అని మాత్రమే భావించకండి ప్రతిరోజు కూడా ఉసిరిని తినటం అలవాటు చేసుకోండి. ఉసిరి కాయని తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక భావనలతో పూజలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ప్రతి ఇంట్లో ప్రతినిత్యం దీపాలు వెలిగించాలి.

దీప ధూపాలతో ఇంట్లో వేడి పెరుగుతుంది. అందుకే కార్తీకమాసంలో ఉసిరికి అంతటి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఆ జగన్నాటక సూత్రధారి అయిన విష్ణుమూర్తి ఉసిరి చెట్టు స్వరూపంగా మనందరినీ రక్షిస్తారని మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ ఉసిరికి పూజలు చేయడం ఆరాధించటం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. కార్తీక మాసంలో వీలైన ప్రతి ఒక్కరూ ఉసిరిని ఆరాధించండి. ఉసిరి దీపాన్ని వెలిగించండి. ఈ కాలంలో దొరికేటువంటి ఉసిరికాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు కాబట్టి దోషాలు తొలగిపోవడానికి ఆర్థిక సమస్యల బారిన పడకుండా ఉండటానికి ఇప్పటివరకు చేసుకున్న పుణ్యాలశాతం పెరగటానికి మనకి అన్నిటికీ కూడా ఈ ఉసిరి యొక్క మహత్యం ఎంతగానో ఉపయోగపడుతుంది…

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది