Usiri Tree : కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలెందుకు చేయాలి?
Usiri Tree : హిందూ సంప్రదాయాల ప్రకారం కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసం అంతా హిందువులు ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఈ మాసంలో భక్తి, శ్రద్ధలతో శివ కేశవులిద్దరనీ ఆరాధిస్తుంటారు. అంతే కాకుండా శ్రావణ మాసంలో లాగానే.. కార్తీక మాసంలోనూ ఎలాంటి మాంసాహారాలు ముట్టుకోకుండా నియన నిష్టలు పాటిస్తూ.. దీపాలు వెలిగించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. అయితే ఈ మాసంలోనే పరమ పవిత్రమైన ఉసిరి చెట్టుకు కూడా పూజలు చేస్తుంటారు. అంతే కాదండోయ్ ఉసిరి కాయల దీపాలు కూడా వెలిగిస్తారు. దీంతో పాటు ఉసిరి చెట్టును సాక్షాత్తు శ్రీ మహా విష్ణువుగా భావించి ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అసలు కార్తీక మాసానికి ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడానికి సంబంధం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే పురాణ గ్రంథాల ప్రకారం ఉసిరి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత అంది. పూజలకు మాత్రమే కాకుండా ఈ మొక్కను ఔషధ గుణాలు కలిగిన మొక్కగా భావిస్తారు. అయితే కార్తీక మాసం చలి కాలంలో వస్తుంది. అయితే శీతా కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటిని దూరం చేసే ఉద్దేశ్యంతో… మన ఆరోగ్యానికి మేలు చేసే ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయాలే సంప్రదాయాన్ని పెట్టారు. దాన్నే మనం ఇప్పటికీ పాటిస్తున్నాం. అయితే భోజనాలకు ముందు ఉసిరి చెట్టు కింద శ్రీ మహా విష్ణువు చిత్ర పటాన్ని పెట్టి పూజ చేయాలి. ఆ తర్వాత భోజనాలు చేయాలి.
ఎన్నో ఔషధ గుణాలు కల్గి ఉన్న ఉసిరి చెట్టును ధాత్రి వృక్షం అని కూడా పిలుస్తారు. అందవల్లే ఉసిరి చెట్టు కింద చేసే భోజనాలను, కార్తీక మాసంలో చేసే భోజనాలను ధాత్రి భోజనాలు అని పిలుస్తారు. ఉసిరి చెట్టు నీడలో అరటి ఆకులో భోజనం చేయడం.. శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మానసికి ఉల్లాసాన్ని కల్గజేస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే శ్రీ కృష్ణ పరమాత్ముడు, ఆయన అన్న బలరాముడు, గోప బాలలు, బాలికలతో కలిసి భోజనాలు చేశారని భవద్గీత చెబుతోంది. ఉసిరి కాయలు అంటే లక్ష్మీ దేవికి చాలా ఇష్టం. ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం వల్ల లక్ష్మీ దేవి కటాక్షం కూడా కల్గుతుందని భక్తుల నమ్మకం.