Vastu Tips : మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా అయితే ఈ పూల మొక్కలను పెంచడి….
Vastu Tips : సాధారణంగా ఎవరైనా తమ ఇంటిని వాస్తు ప్రకారంగా నిర్మించుకుంటారు. అయితే వాస్తు ప్రకారం ఇంటినే కాదు, భార్య భర్తల అనుబంధం చక్కగా కొనసాగాలి అన్న ఇంట్లో కొన్ని పూల మొక్కలను పెంచాలి. అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇంట్లో ఈ పూల మొక్కలను పెంచితే భార్యాభర్తలు జీవితాంతం అన్యోన్యంగా, ప్రేమానురాగాలతో కలకాలం చల్లగా ఉంటారు. అయితే ఇప్పుడు ఇంట్లో ఎటువంటి పూల మొక్కలు పెంచుకోవాలో తెలుసుకుందాం…
1) మీ ఇంట్లో ఎరుపు రంగు గులాబీ పూల మొక్కలను నాటితే భార్యాభర్తల మధ్య ప్రేమను పెరుగుతుంది. ఈ పూల మొక్కలను మీ ఇంట్లో నాటు కోవడం వలన ఇరువురి మధ్య ఎటువంటి గొడవలు జరగవు. ఈ పువ్వుల మొక్క మీ ఇంట్లో ఉంటే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీనివలన ఇంట్లోని వారు సుఖసంతోషాలతో జీవిస్తారు.

Vastu Tips for wife and husband relationship sweetness by planting thes flowers.
2) అలాగే బిళ్ళ గన్నేరు పువ్వులు తెలుపు, పింక్ రంగులో ఉండే మొక్కలు నాటితే మీ ఇరువురి మధ్య ప్రేమ పెరుగుతుంది. అలాగే ఈ బిళ్ళ గన్నేరు మొక్కలను మీ ఇంటి ముందు ఆవరణలో నాటడం వలన మీకు, మీ కుటుంబానికి నెగటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది.
3) మల్లె పూలు అంటే ఇష్టపడని వారు ఉండరు.. ఈ పూలు భార్య భర్తల మధ్య ఉన్న ప్రేమ అనురాగాలను ఎక్కువగా పెంచుతాయి. భార్య భర్తల ప్రేమానుబంధాలు చిరకాలం దృఢంగా ఉంటాయి. జీవితాంతం సుఖసంతోషాలతో హాయిగా జీవిస్తారు. మల్లె పూల మొక్కను వీలు అయినంత వరకు ఇంట్లో నాటు కోవడం మంచిది.
4) అలాగే తామర పువ్వు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ పువ్వును ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి సమర్పిస్తే మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే భార్య భర్తలు కలకాలం సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో జీవిస్తారు.