Vastu Tips : మీ ఇంటి నైరుతిలో ఇవి ఉన్నట్లయితే… బాగా నష్టాలలో పడ్డట్టే…!
Vastu Tips : ఒక ఇంటిని కట్టేటప్పుడు అందరూ తప్పకుండా వాస్తు ప్రకారంగా ఆ ఇంటిని నిర్మిస్తూ ఉంటారు. చిన్న ఇంటి నుండి ఎంత పెద్ద ఇల్లు అయినా సరే వాస్తు ప్రకారం నిర్మిస్తూ ఉంటారు. వాస్తు శాస్త్ర పండితుల ఇచ్చే సలహాల సూచనలు బట్టి ఇంటిని నిర్మిస్తూ ఉంటారు. గృహ నిర్మాణం ఏ విధంగా అయితే వాస్తు ప్రకారంగా ఉండాలో ఆ ఇంట్లో ఉండే వస్తువులు కూడా అదే ప్రకారంగా ఉండాలని వాస్తు శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. గృహంలో ఉండే వస్తువులు మన ఐశ్వర్య ఆరోగ్యాలపై ప్రభావం పడుతుందని తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలోనే గృహం నైరుతి దిశన కొన్ని వస్తువులు నిర్మాణాలు జరిగితే చాలా నష్టం జరుగుతుందని వాస్తు నిపుణులు చెప్పడం జరిగింది. ఇంతకీ వాస్తు శాస్త్రం ప్రకారంగా నైరుతి దిశన ఎటువంటి వస్తువులు పెట్టకూడదో తెలుసుకుందాం…
*నైరుతి దిసిన గెస్ట్ రూమ్ ను కూడా కట్టకూడదు. ఈ దిశలో నివసించే వారు మనస్సు మనశ్శాంతిగా ఉండదు. ప్రవర్తనలో సడన్ గా మార్పులు వస్తూ ఉంటాయి.
*ఇంటికి నైరుతి దిశలో మరుగుదొడ్డి ఉండకూడదు. ఇది ఇంట్లో ఉండే వాళ్లపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనివలన ఇంట్లో ఉండే వారి ఆర్థిక పురోగతిపై ప్రతికూల ప్రభావం కనబడుతుంది. అదేవిధంగా ఎప్పుడు అనారోగ్యంతో ఉంటారు.
*నైరుతి దిశలో పిల్లలు స్టడీ రూమ్ ను కట్టకూడదు. ఈ దిశలో కూర్చుంటే ఏకాగ్రత కరువు అవుతుంది. కావున ఎంత చదివినా పెద్దగా రిజల్ట్ కనిపించదు.
*ఇంటికి నైరుతి మూలలో అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకు ఎట్టి పరిస్థితిలోనూ పెట్టకూడదు. దీనివలన వాస్తు దోషాలు అధికమవుతూ ఉంటాయి. అయితే తప్పని పరిస్థితిలో ఈ దిశలో పైకి ట్యాంక్ ని పెట్టుకోవచ్చు..
*వాస్తు నిపుణుల అభిప్రాయం విదానంగా నైరుతి మూలలో ఎట్టి పరిస్థితుల్లో పూజ గదిని అస్సలు ఉండకూడదు. ఈ మూలన ప్రతిష్టించిన దేవతలను పూజిస్తే ఫలితం అస్సలు దక్కదని తెలియజేస్తున్నారు. అలాగే ఈ దిక్కున కూర్చుంటే ఏకాగ్రత కూడా అస్సలు కలగదు. కావున ఇక్కడ కూర్చుని ధ్యానం వంటివి చేసిన ప్రశాంతత కలగదు..