Kalagnanam : బ్రహ్మంగారు 2022లో ప్రపంచంలో ఈ వింతలు జరుగుతాయని చెప్పారు… అవేంటో తెలుసా… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kalagnanam : బ్రహ్మంగారు 2022లో ప్రపంచంలో ఈ వింతలు జరుగుతాయని చెప్పారు… అవేంటో తెలుసా…

 Authored By aruna | The Telugu News | Updated on :12 September 2022,6:00 am

Kalagnanam : సాక్షాత్తు దైవ స్వరూపుడైన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కలియుగంలో జరగబోయే వింతలను, భవిష్యత్తును తన మనోనేత్రంతో దర్శిస్తూ కాలజ్ఞానాన్ని రచించారు. ఇప్పటివరకు బ్రహ్మంగారు చెప్పినవన్నీ చాలా వరకు జరిగాయి. మరెన్నో సంఘటనలు భవిష్యత్తులో జరగబోతున్నాయి. బ్రాహ్మణులు తమ కులవృత్తులను వదిలి ఇతర కర్మలను చేపడతారు. దీని వలన కలియుగమంతా అల్లకల్లోలంగా మారుతుంది. కాశీ నగరాన్ని కొన్ని రోజులపాటు మూసివేస్తారు. 1910-12 మధ్యలో గంగా నదికి వరదలు వచ్చినప్పుడు కలరా వ్యాధి వ్యాపించింది. దాంతో కాశిని చాలా రోజుల వరకు దర్శించలేదు. తాజాగా 2020 లో కరోనా వలన మరోసారి ఆలయం మూత పడింది.

సృష్టికి ప్రతి సృష్టి చేయాలంటూ అనేక రకాల యంత్రాలను తయారు చేస్తారు. అవయవాలను అమరుస్తారు. అయితే చావుని తప్పించే యంత్రాన్ని మాత్రం కనిపెట్టలేరు. దేశంలో పెద్ద పొగ మేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకొని ఎక్కువగా మరణిస్తారు. కంచి కామాక్షి దేవత కంటి వెంట నీరు కారుతుంది. అనంతరం వేలాదిమంది మరణిస్తారు. కృష్ణ గోదావరి మధ్య మహాదేవుడు అన్నవాడు జన్మించి అన్ని మతాలను సమానంగా చూస్తూ గుళ్ళు గోపురాలు నిర్మిస్తాడు. పేరు ప్రఖ్యాతలు పొందుతాడు. మహిళలు నడత తప్పుతారు. వావి వరుసలు మాయం అవుతాయి. కృష్ణమ్మ దుర్గమ్మ ముక్కు పుడకని తాకుతుంది. రాజులు బిచ్చగాళ్లు అవుతారు. బిచ్చగాళ్లు ధనవంతులవుతారు. వ్యాపారం నీతిగా చేయాలనుకునేవారు కరువు అవుతారు. ధన ఆశతో జీవితాన్ని సాగిస్తారు.

Veera Brahmendra Swamy say about kalagnanam 2022

Veera Brahmendra Swamy say about kalagnanam 2022

అడవి జంతువులు పట్టణాలు పల్లెల్లో తిరుగుతాయి. అడవులు అరణ్యాలలో మంటలు ఏర్పడి రోజుల తరబడి మండుతాయి. కృష్ణానది మధ్యలో రథం కనబడుతుంది. రధం చూసిన వారి కళ్ళు పోతాయి. రెండు బంగారు హంసలు భూమి మీద తిరుగుతాయి. అత్యాశతో వాటిని పట్టుకోవాలనుకునేవారు నాశనం అవుతారు. శ్రీశైలం పర్వతం పై మొసలి సంచరిస్తుంది. ఆ మొసలి ఎనిమిది రోజులు ఉండి బ్రమరాంబ గుడిలో చేరి మేకలా అరిచి మాయమవుతుంది. తూర్పు దేశమంతా నవ నాగరికత పేరుతో విచ్చలవిడితనం పెరుగుతుంది. వివాహాల్లో కుల గోత్రాల పట్టింపులు లను వదులుతారు. ప్రపంచంలో నదులు పొంగుతాయి. వరదలు బీభత్సం సృష్టిస్తాయి. జల ప్రవాహాల వలన 14 నగరాలు మునిగిపోతాయి. ఆనంద నామ సంవత్సరాలు 13 గడిచే వరకు ఈ నిదర్శనలు కనబడతాయి అన్నారు. ఇలా జరిగిన సమయంలో తాను మళ్ళీ వీరభోగ వసంతరాయులుగా జన్మిస్తానని వీర బ్రహ్మంగారు చెప్పారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది