Anjaneya Swamy : ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ఎందుకంత ఇష్టమో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anjaneya Swamy : ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ఎందుకంత ఇష్టమో తెలుసా?

Anjaneya Swamy : భక్తుల భయాల్ని పోగొట్టే ఆంజనేయ స్వామి గురించి తెలియని వారుండరు. అంతే కాకుండా మన భారత దేశంలో దాదాపుగా ఆయనకు గుడి లేని ఊరు ఉండదు. అయితే ఆంజనేయ స్వామిని ఆరాధించేందుకు మంగళ వారం అనువైన రోజు. ఆ రోజు అంటే స్వామి వారికి ఎంతో ఇష్టం. అందుకే మంగళ వారం రోజే ఎక్కువగా స్వామి వారికి పూజలు చేస్తుంటారు. అంతే కాకుండా శనివారం రోజు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తుంటారు. అయితే మనం […]

 Authored By pavan | The Telugu News | Updated on :13 March 2022,6:00 am

Anjaneya Swamy : భక్తుల భయాల్ని పోగొట్టే ఆంజనేయ స్వామి గురించి తెలియని వారుండరు. అంతే కాకుండా మన భారత దేశంలో దాదాపుగా ఆయనకు గుడి లేని ఊరు ఉండదు. అయితే ఆంజనేయ స్వామిని ఆరాధించేందుకు మంగళ వారం అనువైన రోజు. ఆ రోజు అంటే స్వామి వారికి ఎంతో ఇష్టం. అందుకే మంగళ వారం రోజే ఎక్కువగా స్వామి వారికి పూజలు చేస్తుంటారు. అంతే కాకుండా శనివారం రోజు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తుంటారు. అయితే మనం ఆంజనేయ స్వామి గుడికి వెళ్లినప్పుడు మనకు సింధూరాన్ని ఇస్తారు. అంతే కాకుండా కోరిన కోర్కెలు తీరిస్తే… ఈ స్వామి వారిని పూజించే వారు ఎక్కువగా సింధూరంతో పూజిస్తుంటారు. అసలు ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ఎందుకంత ఇష్టమో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీరామ చంద్రుడకి పరమ భక్తుడైన ఆ హనుమంతుడు… సీతారాముల వనవాసం తర్వాత ఆయోధ్యకు చేరుకుంటారు. వీరి వెంట ఆంజనేయ స్వామి కూడా అయోధ్యకు చేరుకుంటాడు. అక్కడ కొన్నాళ్లు గడిపిన తర్వాత పనులన్నీ ముగించుకొని అంతఃపురంలోకి ప్రవేశించి సీతమ్మ తల్లిని భోజనం వడ్డించమని అడిగాడు. అప్పుడే స్నానం చేసి వచ్చిన సీతాదేవి… హనుమూ కాసేపు ఆగు పాపిట బొట్టు పెట్టుకొని వస్తానని చెప్తుంది. వచ్చాక బొట్టు పెట్టుకొని తర్వాత భోజనం వడ్డిస్తానని చెప్పి వెళ్తుంది. అయితే ఆ విషయం విన్న ఆంజనేయ స్వామి… ఎందుకలా పెట్టుకుంటారని సీతా దేవిని అడుగుతాడు. అందుకు సీతాదేవి… ఈ పాపిట్లో బొట్టు పెట్టుకోవడం వల్ల నీ ప్రభువు.. శ్రీరామ చంద్రుడు నిండు నూరేళ్లు చల్లగా ఉంటారని తెలిపింది. ప్రతిరోజూ ఈ సింధూరం ధరించడం వల్ల సౌభాగ్య వృద్ధి కలుగుతుందని చెప్పింది.

what is the reason behind anjaneya swamy likes sindhur

what is the reason behind anjaneya swamy likes sindhur

అలా చెప్పి సీతమ్మ తల్లి పాపిట బొట్టు పెట్టుకొని వచ్చేసరికి… వాయు పుత్రుడు శరీరం అంతటా సింధూరం పూసుకొని ఉంటాడు. ఒక్క సారిగా హనుమంతుని చూసి ఆశ్చర్యపోయిన సీతా దేవి ఏంటిదని ప్రశ్నించగా… ఈ సింధూరం పెట్టుకోవడం వల్ల స్వామి వారు నిండు నూరేళ్లు చల్లగా ఉంటారని చెప్పారు కదా.. అందుకే ఇలా చేశానని చెప్తాడు. అయితే హనుమంతుడికి శ్రీరాముని పై ఉన్న భక్తిని చూసిని సీతాదేవి ప్రేమతో ఆంజనేయ స్వామిని ఆశీర్వదిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీరామ చంద్రుడు… భక్తికి నువ్వు ఒక ఉదాహరణగా నిలుస్తావని వాయు పుత్రుడికి చెప్తాడు. ఇక నుంచి ఎవరైతే నిన్ను సింధూరంతో పూజిస్తారో వారిని కష్టాల నుంచి నేను కాపాడతానని సాక్షాత్తు శ్రీరామ చంద్రుడు తెలియజేశారు.అప్పటి నుంచి వాయు పుత్రుడికి సింధూరం అంటే ఎంతో ప్రీతికరమైనదని భావించి పూజలు చేస్తారు.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది