Anjaneya Swamy : ఇంట్లో ఇలాంటి ఆంజనేయ స్వామి ఫొటో పెడ్తే.. ఇక మీ పని అంతే!
Anjaneya Swamy : ప్రతీ ఒక్క హిందువు ఇంట్లో చిన్నదో పెద్దదో దేవుడి ఫొటో లేదా విగ్రహం ఉండటం సహజమే. అయితే మనకు ముక్కోటి దేవతలు ఉన్నప్పటికీ కొన్ని దేవుళ్ల ఫొటోలను మాత్రమే మనం ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం. అందులో ఎక్కువగా కనిపించేవి లక్ష్మీ దేవి, ఆంజనేయ స్వామి, సాయిబాబా, వేంకటేశ్వర స్వామి, నరసింహ స్వామి ఇలా పలు రకాలు ఉంటాయి. అయితే ఆంజనేయ స్వామి ఫొటో ఇంట్లో పెట్టుకోవాలనుకున్న వారు కొన్ని రకాల పటాలు పెట్టుకోవడం మంచిదని కాదని వేద పండితులు చెబుతున్నారు. హనుమంతుడి ప్రతిమ ఎంపికలో కొన్ని నియమ, నిబంధనలు జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందేనని సూచిస్తున్నారు. ఎలాంటి పటం పడితే అలాంటిది పెట్టడం వల్ల ఇంటికే అరిష్టమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిమ ఎంపికలో ఏ చిన్న పొరపాటు జరిగినా కుటుంబ సభ్యులంతా ఇబ్బందులు పడతారని వవరిస్తున్నారు. అయితే ఎలాంటి ఫొటో పెట్టుకోవాలి, ఎలాంటి ఫొటో పెట్టుకోకూడదో.. దాని వల్ల ఏం జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఆంజనేయ స్వామి ఛాతీ చీలుస్తూ.. గుండెల్లో సీతా రూముల ప్రతిమను చూపించే విధంగా ఉన్న ఫొటోలను ఇంట్లో అస్సలే పెట్టకూడదట. అలాంటి చిత్రం ఇంట్లో పెడితే ఇంటికి అరిష్టమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అలాగే హనుమంతుడి భుజాలపై రామ లక్ష్మణులు కూర్చున్నట్లు ఇండే చిత్ర పటాన్ని కూడా ఇంట్లోని ఉంచుకోకూడదట. అంతే కాకుండా ఆంజనేయ స్వామి తోకకు నిప్పు ఉండి…
ఆయన లంకా దహనం చేస్తున్నట్లుగా ఉండే ఫొటోను కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. ఇలాంటి చిత్ర పటాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో ప్రతికూలత ఏర్పడుతుందట.అందుకే పొరపాటున కూడా ఇలాంటి ఆంజనేయ స్వామి ఫొటోలను మన ఇంట్లోని పూజా మందిరాల్లో పెట్టుకోకూడదు. పవన పుత్ర రూపంలో హనుమంతుడు గాల్లో ఎగురుతున్నట్లు అండే ఫొటోను కూడా ఇంట్లో పెట్టక పోవడం మంచిదట. ఇలాంటి ఫొటోలు ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యుల జీవితాల్లో ఎప్పుడూ కష్టాలు వస్తుంటాయట. ఇంట్లోని పూజా మందిరంలో ఉండే దేవుళ్లు ఎప్పుడూ నవ్వుతూ.. సున్నితంగా ఉండే చిత్ర పటాలను ఉంచడం మంచిదని సూచిస్తున్నారు. అందుకే ఇంట్లోని పూజా మందిరంలో పెట్టేందుకు ఫొటోలు లేదా విగ్రహాలు కొనేటప్పుడు ఒకసారి ఆలోచించడం మంచిది.