గడప మీద కూర్చుంటే అంత నష్టం జరుగుతుందా? వామ్మో..!
ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉండే గడప పై కూర్చోవద్దని మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. ఒక వేళ పొరపాటున మనం కూర్చున్నామంటే ఒక్కటిస్తారు. ఏంటిది ఇప్పటికే.. మన పరిస్థితి బాగాలేదంటే.. ఇంకా గడపపై కూర్చున్నావా అంటూ తిడుతుంటారు. అయితే గడపపై మనం కూర్చుంటేనే ఇంట్లో మస్యలు వస్తాయా అని మనకు చాలా సార్లే అనిపించి ఉంటుంది. కానీ సరైన కారణం ఏంటో మనకు తెలియదు. కూర్చోవద్దని చెబుతారే తప్ప మన పెద్దలు కారణం ఏమిటో చెప్పరు. అయితే పెద్ద వాళ్లు గడప పై కూర్చోవద్దు అని చెప్పడం వెనుక ఆంతర్యం ప్రధాన ద్వారంలో గల గడపపై కూర్చోవడం అస్సలే మంచిది కాదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ప్రధాన ద్వారం లోపల గడపకు కింద ఉండే మెట్లపై కూడా కూర్చోవద్దంట.
ఈ రెండు ప్రదేశాల్లో కూర్చోవడం వల్ల మన ఇంట్లోకి వచ్చే లక్ష్మీ దేవిని అడ్డుకున్నట్లు అవుతుందట. అలాగే ఇల్లు కట్టుకున్న సమయంలో పూజలు చేసి కొన్ని వస్తువులను ఇంటి ప్రధాన ద్వారం వద్ద గల గడప కింద ఉంచుతాం. అలా పెట్టిన నాటి నుంచి గడపను కూడా దేవతలా పూజిస్తాం. ఈ గడపను ముందుగా ప్రతిష్టించేటప్పుడు… కేవలం ఆడ బిడ్డలతో మాత్రమే కడిగిస్తాం. పసుపు రాసి, బొట్టు పెట్టి ద్వారలక్ష్మీ పూజం చేయిస్తాం. మరి అలాంటి దేవతపై కూర్చోవడం తప్పే కదా అని పండితులు అంటున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం గడపను దేవతలా పూజించే మనం.. ఆ గడపపై కూర్చోవడం సరికాదని పురాణాలు చెబుతున్నాయి. అంతే కాదు సైన్స్ ప్రకారం మన ఇంటి ప్రధాన ద్వారం నుంచి కిటికీల నుంచి వెలుతురు, గాలి వస్తుంటాయి. అలా వచ్చే గాలిలో క్రిమి, కీటకాలతో పాటు బ్యాక్టీరియా కూడా ఉంటుంది.

it is good or bad sitting on the gadapa
అయితే ఆ సమయంలో మనం గడపై కూర్చుని ఉంటే అవి నేరుగా మనపైకే చేరుతాయి. అప్పుడు మనం అనేక రోగాల పాలు కావాల్సి వస్తుంది. అందుకే గడపపై కూర్చోవడం మంచిది కాదని అంటారు. అలాగే గాలి, వెలుతురు ఇంట్లోకి వస్తే.. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. అలాంటప్పుడు మనం గడపపై అడ్డంగా కూర్చుంటే లోపలున్న నెగిటివ్ ఎనర్జీ అలాగే ఉండిపోతుంది. దాని వల్ల మనకే అనేక సమస్యలు వస్తాయి. ఎప్పుడూ ఏదో ఒక సమస్య, చికాకు, గొడవలు వస్తుంటాయి. అందుకే మన పెద్దలు గడపపై కూర్చోవద్దని చెబుతుంటారు.