ప్రార్థనా చివర్లలో ఓం శాంతి శాంతి శాంతిః అని ఎందుకు చదువుతారు?
మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఉదయం లేవగానే మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు అలాగే రాత్రి పడుకునే ముందు కొన్ని రకాల ప్రార్థనలు చేస్తుంటాం. అయితే ప్రతీ ప్రార్థన ముగిసే సమయంలో అంటే చివర్లో ఓ శాంతి.. శాంతి.. శాంతిః అని అంటుంటాం. కానీ ఇలా ఎందుకు చదువుతామో దానికి అర్థం ఏమిటో చాలా మందికి తెలియదు. అయితే ఈ శాంతి మంత్రం వెనుకున్న అర్థం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటి సారి శాంతి అనగానే… మనకీ మన వారికీ, దుఃఖ బాధలు తొలగాలనీ.. రెండవ సారి శాంతి అనగానే మన చుట్టూ ఉన్న సమస్త ప్రాణి కోటి సుఖంగా ఉండాలనీ… మూడవ సారి శాంతిః అనగానే ప్రకృతి పరంగా, గ్రహాల పరంగా ఏ ఉప ద్రవాలూ భూ మండలాన్ని తాక వద్దని కోరుకోవడం. అ ప్రార్థన చివరలో అయినా మనం ఓం శాంతి శాంతి శాంతిః అని మూడు సార్లు ఉచ్చరిస్తుంటాం. ఆ విధంగా మూడు సార్లు అనడం ద్వారా మూడు రకాలు అయినటువంటి తాపాలు (బాధలు) తొలగాలని భగవంతుడిని ప్రార్థించడం అన్నమాట.
ఓం శాంతి ( ఆధ్యాత్మిక తాపం చల్లారు గాక
ఓం శాంతి ( ఆది భౌతిక తాపం చల్లారు గాక)
ఓం శాంతిః (అధి దైవిక తాపం చల్లారు గాక)
1. అధ్యాత్మిక తాపం అంటే శరీరానికి సంబంధించిన వివిధ రకాలైన రుగ్మతలు, రోగాలు మొదలగునవి తొలగాలని.
2. ఆది భౌతిక తాపం అంటే.. దొంగలు మొదలైన వారి వల్ల కలిగే బాధలు, ప్రమాదాలు తొలగాలని.
3. అది దైవిక తాపం అంటే దైవం వంశం వల్ల కలిగే బాధలు… యక్షులు, రాక్షసులు మొదలైన వారి వల్ల కలిగే ఊహకు కూడా అందని బాధలు, ప్రమాదాలు మొదలైనవి తొలగాలని ప్రార్థించడం అన్నమాట.
ఓం శాంతి శాంతి శాంతిః అని మూడు సార్లు చెప్పడంలో ఇంత పెద పరమార్థం దాగి ఉంది. అందుకే రోజులో ఒక్కసారి అయినా మీకు నచ్చిన మంత్రాన్ని చదివి మీ బాధలను తొలగించుకోండి. ఆ భగవంతుడిని కృప మీపై ఉండాలని ప్రార్థించండి. ఇలా ప్రార్థించడం వల్ల మీకు రాబోయే కష్టాలను ఆ భగవంతుడు ముందుగానే రాకుండా అడ్డుకుంటాడు.