Pothuraju : గ్రామ దేవతలతో పాటు ఎందుకు పోతురాజుని కూడా పూజిస్తారు..!? అసలు కథేమిటంటే..!?
Pothuraju : మన ఊరిలో ప్రతి ఒక్కరూ పాటు గ్రామ దేవతను కూడా పూజిస్తారు.. పోలేరమ్మ, మావుళ్ళమ్మ, గంగానమ్మ వంటి గ్రామ దేవతలకు జాతరలు జరుగుతున్నప్పుడు.. పోతురాజు కూడా పూజించడం మనం చూస్తుంటాం.. మన జానపద సాహిత్యంలో కూడా పోతురాజు పేరు వినిపిస్తుంది.. ఇంతకీ పోతురాజు ఎవరు.!? గ్రామదేవతలుగా పలుచోట్ల పూజించబడుతున్న అతని అక్కలు ఎవరు.!? వారి పుట్టుక వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఏమిటి.!? మొదలైన విషయాలను ఈరోజు తెలుసుకుందాం..! శ్రీమహావిష్ణువు రామావతారంలో ఉండగా ఆయన సౌందర్యానికి ముచ్చటపడిన మహాలక్ష్మి ఆయన దగ్గరకు ఒకసారి ప్రేమభావానితో వచ్చినది కానీ ఈ అవతారంలో నేను ఏకపత్ని వ్రతుడునని చెప్పి సున్నితంగా ఆమెను తన వద్దకు రావద్దు అని పంపించేస్తడు.. మీ భార్య నైన నన్ను ఈ అవతారంలో నన్ను ఎంత బాధ పెట్టారు.. ఎందుకు మీరు మరొక అవతారం ఎత్తి చెడు నడతగలవారిగా దొంగగా ముద్ర వేయించుకుంటారు అని లక్ష్మీదేవి శపించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..
అలా అయితే నువ్వు కూడా అదే జన్మలో జన్మించిన విరహవేదనలను అనుభవించదు గాక అని తిరిగి శపిస్తాడు.. అందుకు లక్ష్మీదేవి క్షమించమని కోరుకుంటుంది.. ఇది వీధి లిఖితం ఎవ్వరం తప్పించుకోలేము.. నేను కొంతకాలం శ్రీకృష్ణుడి అవతారంలో గొల్లవారి ఇంట జన్మిస్తాను ఆ సమయంలో నేను జారుడు, చోరుడు అనే నీ శాపాన్ని అనుభవిస్తాను ఇక నీవు కామవల్లి పేరుతో నువ్వు ఆ ఆది దంపతులకు జన్మిస్తావు.. నా మీద విరహంతో జీవిస్తావు నేను తిరిగి కలిగే అవతారం ఎత్తినప్పుడు నువ్వు మళ్ళీ నన్ను చేరుకుంటావు అని చెబుతాడు.. పార్వతీదేవి వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇద్దరు ఆడుకుంటుండగా చూసి ఆనందిస్తుంది శివుడితో స్వామి మనకి ఇద్దరూ అబ్బాయిలు ఉన్నారు కానీ పుత్రిక కూడా ఉంటే బాగుండేది అని అంటుంది తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది అని శివుడు వరం ఇస్తాడు ఒకరోజు పార్వతి దేవి శివుడు ఇద్దరూ కలిసి సరస సల్లాపాలు ఆడతారు..
అలసిపోయిన పార్వతీదేవి అక్కడ సరస్సులోని నీటిని దోసిటపట్టి తాగుతుంది ఆ సరస్సులోని నీరు లక్ష్మీదేవి స్వరూపం.. అలా రాముడు లక్ష్మీదేవికి వరం ఇచ్చిన విధంగా ఆ నీటిలో నుంచి లక్ష్మి దేవి పార్వతి దేవి గర్భంలోకి ప్రవేశిస్తుంది.. అప్పుడు ఆ పార్వతీదేవి సజ్జోగర్భం ద్వారా ఏడుగురు పుత్రికలకు జన్మనిస్తుంది.. వారిలో అమ్మవారి జడతల నుండి పుట్టినామేకు ఎర వాణి అని.. శిరస్సులో నుంచి పుట్టినామెకు శివవాణి అని.. కొప్పులోన పుట్టినామెకు కొండవాణీ అని.. ముఖం నుండి పుట్టినామెకు ముద్దరాలా అని.. చన్నులు నుంచి పుట్టినామెకు జక్కులమ్మ అని.. కళ్ళ నుంచి పుట్టినామెకు కామవల్లి అని నామకరణం చేశారు.. మీరంతా సజ్జోగర్భంలో జన్మించారు గనుక వెంటనే యవ్వన వతులు అయ్యారు.. పార్వతి దేవి ఈ పిల్లలందరినీ దాంతోపాటు కైలాసం తీసుకువెళ్దాం అని అంటుంది.. శివుడు ఆమెను వారించి లక్ష్మీదేవి కథను వివరించి చెబుతాడు..
అయితే వీరికి తోడుగా ఒక బాలుడిని కూడా సృష్టిద్దాం.. అతనికి పోతురాజు అని పేరు పెడదాం.. వారికి కావాల్సిన సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి అది దంపతులు పోతారు.. ఒకరోజు కామవల్లి తన అక్కలతో కలిసి సరస్సులో స్నానం చేస్తుండగా అక్కడికి వచ్చిన గోపకులు కూడా అదే సరస్సులోకి దిగి స్నానం చేసి ఇస్తారు.. దాంతో కోపం వచ్చినా కామవల్లి వారిని శపిస్తుంది.. అక్కడే ఉన్న గోవులు కూడా ఆ మనుషులతో పాటు శిలలుగా మారిపోతాయి.. అప్పుడు అక్కడికి వచ్చిన గోపాల నందనుడు శ్రీకృష్ణుడు తన వేణు గానంతో మైమరపించి ఆ శిలలను మళ్లీ మనుషులుగా గోవులను యధా స్థానానికి తీసుకువస్తాడు. అప్పుడు కామవల్లి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంది.. రామావతారంలో జరిగిన కథ మొత్తం తెలియజేసి ఇప్పుడు కుదరదు అని చెబుతాడు.. మనం కల్కి అవతారంలో మాత్రమే కలుసుకుంటామని చెబుతాడు..
నీకు ఉపశమనం కోసం ఒక మార్గం చెబుతాను.. నీ అంశాలు కొంత భాగాన్ని భీష్మక మహారాజు గారి భార్యలో ప్రవేశపెట్టు ఆమె గర్భంలో నుంచి రుక్మిణి గా పుట్టి నాకు భార్యవు కావచ్చు.. మిగతా సగభాగంతో కామవల్లి స్వరూపం ఎందరో భక్తులతో ఇలవేల్పుగా మారుతుంది వారి పూజలతో నీకు మరి కాస్త ఉపశమనం కలుగుతుంది.. అలా ఆనాటి నుండి ఆ కామవల్లి దేవి గ్రామ దేవతగా 72 ప్రదేశాలలో నెలకొని పూజలందుకుంటుంది.. ఆమె అక్కలైన మిగతా ఆరుగురు కూడా పూజలు అందుకుంటున్నారు.. ఎల్లమ్మ అక్కమ్మ గంగానమ్మ పోలేరమ్మ జోగులమ్మ పెద్దింటమ్మ భక్తుల అభిష్టాలు నెరవేర్చుతూ పూజలు అందుకుంటున్నారు.. ఇక వీరి జాతరలు జరిగినప్పుడల్లా వారి ముద్దుల తమ్ముడు పోతురాజుకి కూడా పూజలు చేస్తారు.. ఈ వీడియో మీకు ఎంతో కొంత సమాచారాన్ని అందించిందని మేము భావిస్తున్నాం. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోలను ఈ చానెల్ లో మీకోసం త్వరలో అందిస్తాం.