Dussehra : దసరా రోజు పాలపిట్టను చూడడానికి గల కారణం ఏంటి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Dussehra : దసరా రోజు పాలపిట్టను చూడడానికి గల కారణం ఏంటి..?

Dussehra : దసరా పండుగను ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున జరుపుకుంటారు. విజయదశమి తమ జీవితాల్లో కొత్త విజయాలను తీసుకురావాలని కోరుకుంటారు. అయితే దసరా అనగానే గుర్తుకొచ్చేది జమ్మి చెట్టు. కొన్ని ప్రాంతాల్లో జమ్మి ఆకులు ఇచ్చి పుచ్చుకునే సాంప్రదాయం ఉంటుంది. అలాగే పాలపిట్ట దర్శనానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. దసరా రోజు కచ్చితంగా పాలపిట్టనే చూడాలి అని భావిస్తుంటారు. సాధారణంగా చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే పాలపిట్టలు కనిపిస్తాయి. అందుకే జమ్మి ఆకుల కోసం […]

 Authored By prabhas | The Telugu News | Updated on :4 October 2022,4:00 pm

Dussehra : దసరా పండుగను ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున జరుపుకుంటారు. విజయదశమి తమ జీవితాల్లో కొత్త విజయాలను తీసుకురావాలని కోరుకుంటారు. అయితే దసరా అనగానే గుర్తుకొచ్చేది జమ్మి చెట్టు. కొన్ని ప్రాంతాల్లో జమ్మి ఆకులు ఇచ్చి పుచ్చుకునే సాంప్రదాయం ఉంటుంది. అలాగే పాలపిట్ట దర్శనానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. దసరా రోజు కచ్చితంగా పాలపిట్టనే చూడాలి అని భావిస్తుంటారు. సాధారణంగా చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే పాలపిట్టలు కనిపిస్తాయి. అందుకే జమ్మి ఆకుల కోసం వెళ్ళినప్పుడు ఈ పక్షులు చూస్తుంటారు.

నీలం, పసుపు రంగులో ఉండే ఈ పక్షి రూపం కూడా ఎంతో బాగుంటుంది. పాలపిట్టను పరమేశ్వరుడి స్వరూపంగా భావిస్తారు. అందుకే దసరా రోజు ఈ పక్షిని చూస్తే ఏడాదంతా విజయం అందుతుందని నమ్మకం. అంతేకాకుండా పాలపిట్ట చూడడానికి వెనుక పురాణ గాధలు కూడా ఉన్నాయి. త్రేతా యుగంలో శ్రీరాముడు రావణాసురుడుతో యుద్ధం చేయడానికి బయలుదేరిన సమయంలో దసరా రోజునే పాలపిట్ట ఎదురు వస్తుంది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో రాముడు విజయం సాధించి సీతమ్మను రావణుడి దగ్గర నుంచి తీసుకొస్తాడు. ఆ తర్వాత అయోధ్యకు రాజు అవుతాడు. పాలపిట్టను విజయానికి గుర్తుగా భావించడానికి ఇదొక కారణం.

Why watching palapitta in dussehra occasion

Why watching palapitta in dussehra occasion

అలాగే మహాభారతం ఆధారంగా పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు జమ్మి చెట్టు మీద ఆయుధాలను దాచిపెడతారు. ఆ ఆయుధాలకు ఇంద్రుడు పాలపిట్ట రూపంలో ఉండి కాపలా కాశాడని పురాణ గాథలు చెబుతున్నాయి. అంతేకాకుండా అజ్ఞాతవాసం ముగించుకొని రాజ్యానికి తిరుగు ప్రయాణమైనప్పుడు పాలపిట్ట దర్శనమిస్తుంది. అప్పటినుంచి పాండవుల కష్టాలు అన్ని తొలగిపోయి కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించి రాజ్యాని తిరిగి పొందుతారు. దీంతో పాలపిట్ట విజయానికి ప్రతీక అని భావిస్తూ దసరా రోజున పాలపిట్ట చూడడం అనేది ఆచారంగా వస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది