తమలపాకులో ఏ దేవతలు ఉంటారో మీకు తెలుసా ?
తమలపాకు.. హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రధానమైన పూజ వస్తువు. ప్రతి శుభ, అశుభకార్యంలో కూడా తమలపాకును వాడుతారు. తాంబూలం అనేది లేనిది పూజ పూర్తిగాదు అంటే అతిశయోక్తి లేదు. అయితే తమలపాకులను పూజలో వాడటానికి కారణం ఆ ఆకులో అనేక దేవతా రూపాలు నెలవై ఉంటారని శాస్త్రం చెప్తుంది. తమలపాకులోని ఆయా భాగాలలో ఉండే దేవతామూర్తులను గూర్తి తెలుసుకుందాం…

Wich God in Thamalapaku
తమలపాకు చివరలలో మహాలక్ష్మీ దేవి ఉంటుంది. జ్యేష్టా దేవి తమలపాకు కాడకీ కొమ్మకీ మధ్యన ఉంటుంది. విష్ణుమూర్తి తమలపాకు లో ఉంటాడు. తమలపాకు పైభాగం లో ఇంద్రుడు, శుక్రుడు ఉంటారు. సరస్వతీదేవి మధ్యభాగం లో ఉంటుంది. శివుడు, కామదేవుడు తమలపాకు పైభాగం లో ఉంటారు. తమలపాకు లోని ఎడమవైపున పార్వతీదేవి, మాంగల్య దేవి ఉంటారు. భూమాత తమలపాకుకి కుదిభాగం లో ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటాడు అని శాస్త్రం పేర్పొంది. ఇలా ఆయా దేవతా రూపాలను స్థానాలుగా కలిగిన తమలపాకులను నిత్యం పూజలో వాడటం వల్ల మనకు అనేక శుభాలు, ఆరోగ్యాలు కలుగుతాయి.