Women : స్త్రీలు పొరపాటున కూడా శుక్రవారం ఈ ఐదు పనులు చేయకూడదు…!
Women : శుక్రవారం రోజున ఇంట్లో అందరూ బాగుండాలని లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఉపవాసం కూడా ఉంటారు. అయితే శుక్రవారం రోజున పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. అలా చేస్తే మనకు ధన నష్టం కలుగుతుంది. శుక్రవారం నాడు ఉపవాసం ఉంటే ఆడవాళ్ళ జన్మ ధన్యమవుతుంది. ఎందుకంటే స్త్రీని లక్ష్మీదేవిగా పూజిస్తారు. మన దేశంలో అలా శుక్రవారం ఉపవాసం ఉంటూ లక్ష్మీదేవికి పూజ చేయడం వలన డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయట.. శుక్రవారం రోజు లక్ష్మి దేవి పూజతో పాటు విష్ణువు మరియు గణపతి పూజ చేస్తే ఇంకా చాలా మంచిదని చెప్పారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకు శుభం కలుగుతుంది. శుక్రవారం రోజు మన మీద బల్లి మన మీద పడితే మనకు చాలా మంచి జరుగుతుంది అని చెప్పారు.
ఒకవేళ బల్లి మీద పడితే లక్ష్మీదేవి మీ ఇంట్లో నివాసం ఉంటుంది అని చెబుతారు. రోజు తులసి పూజ చేయడం మర్చిపోవద్దు. గంధాన్ని నీటిలో కలిపి స్నానం చేయండి. శుక్రవారం రోజు ఇల్లుని సాయంత్రం పూట ఊడవకూడదు. పూజ సమయానికి ముందు మాత్రమే చీపురుతో ఇల్లు శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ఇంటికి మంచి జరుగుతుంది. అప్పుడు దీపం పెట్టి లక్ష్మిని బయటికి తీస్తాం కాబట్టి రోజు సూర్యాస్తమయం ముందు మాత్రమే ఇంటిని తుడవాలి. మీ ఇంట్లో చీపురుని ఈశాన్యం వైపు ఉంచకూడదు. ఎందుకంటే ఈశాన్యంలో మనం దేవుని ఉంచుతాం కాబట్టి పొరపాటున కూడా ఇటువైపు చీపురు ఉంచకూడదు. పొరపాటున కూడా చీపురుని పూజ గదిలోను పడకగదిలోను లేదా వంటగది లేదా హాల్లో ఉంచకూడదు.
ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు కూడా చీపురుని పడుకోబెట్టి ఉంచాలి. నిలబెట్టి ఉంచకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆ ఇంటికి దూరమవుతుందని చెప్పారు. పొరపాటున మీ కాళ్లు చీపురుకు తగిలితే లక్ష్మీదేవిని క్షమాపణ అడగండి. శాస్త్రాల ప్రకారం ఋతుక్రమంలో చీపురు ముట్టుకుంటే ఆ ఇంటికి పేదరికం పట్టుకుంటుంది. జీవితం ఎంతో బాధాకరంగా తయారవుతుంది. చీపిరి శనివారం రోజు మాత్రమే కొనాలి. కానీ శుక్లపక్షంలో మాత్రం చీపురుని తీసుకోకూడదట.. చీపురు ఎప్పుడు కృష్ణపక్షంలోనే తీసుకోవాలి. బ్రహ్మముహూర్తంలో ఎవరికైనా మూడు చీపుర్లు దానంగా ఇవ్వండి.
ఇలా చేస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. ఐశ్వర్యం వస్తుంది. ఇంట్లో ఎవరిమీద కూడా చీపురును వాడకూడదు. ఇల్లు ఊడ్చేటప్పుడు మనసులో ఎలాంటి ఆందోళనలో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఇల్లు శుభ్రం చేయాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుంది..