Ayyappa Swamy Prasad : అయ్యప్ప స్వామి ప్రసాదం ప్రత్యేకత తెలిస్తే మీరు షాక్ అవుతారు..?
Ayyappa Swamy Prasad : భారతదేశంలోని ప్రసిద్ధ ఆలయాల్లో అయ్యప్ప శబరిమల ఒకటి. అయ్యప్ప స్వామి మాలవేసిన భక్తులు మాత్రమే శబరిమల వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. ఇక ఆ తర్వాత మాల విరమణ చేస్తారు. అలా దీక్ష పూర్తి చేసుకుని అయ్యప్ప మాల విరమణ చేసిన భక్తులు శబరిమల నుండి అయ్యప్ప ప్రసాదమును తీసుకొస్తారు. అయితే ఆ ప్రసాదం ను ఏమని పిలుస్తారు, ఎలా తయారు చేస్తారు, స్వామి వారి ప్రసాదంగా ఆ ప్రసాదాన్ని ఎందుకు ఎంచుకున్నారు అనే విషయాలను మనం తెలుసుకుందాం. శబరిమలలో అయ్యప్ప స్వామి వారి ప్రసాదంగా ఇచ్చే ప్రసాదాన్ని అరవని అని పిలుస్తారు.
బియ్యం నెయ్యి బెల్లాన్ని ఉపయోగించి ఈ అరవని ప్రసాదం తయారు చేస్తారు. అయితే ఈ ప్రసాదంలో వినియోగించే బియ్యం ,మావెలిక్కర లోని ద్రావిన్ కోర్ దేవస్థానం పరిధిలోని చెత్థికులంగర దేవి ఆలయం నుండి వస్తాయి. అయితే ఈ ప్రసాదమును డబ్బాలలో విక్రయిస్తారు. ఇక ఈ ప్రసాదం రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే శబరిమల యాత్ర అనేది చలికాలంలో ఉంటుంది. ఇక ఈ అయ్యప్ప ప్రసాదం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనిలో ఉండే పోషకాలు శరీరానికి వేడిని అందించి ఆరోగ్యాన్ని రెట్టింపు చేస్తాయి. అయితే ప్రతి సంవత్సరం శబరిమల దేవాలయమును
దాదాపుగా రెండు లక్షల నుంచి పది లక్షల వరకు భక్తులు దర్శించుకుంటారని అంచనా. దీనికోసం శబరిమలలో ప్రతి సంవత్సరం దాదాపుగా 80 లక్షల అరవని ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు. అయితే భారతదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత , అధికంగా భక్తులు దర్శించుకునే దేవాలయం శబరిమల కావడం విశేషం అయితే, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు ప్రసాదం తరువాత అంతటి పేరు ఉన్న ప్రసాదం శబరిమలలో ఉండే అరవని ప్రసాదం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విధంగా శబరిమల యాత్ర తో పాటు అక్కడ లభించే అరవని ప్రసాదం కూడా ప్రాముఖ్యతను సంపాదించుకుంది.