Ayyappa Swamy Prasadam : అయ్యప్ప స్వామి ప్రసాదం ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ayyappa Swamy Prasadam : అయ్యప్ప స్వామి ప్రసాదం ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి…!

Ayyappa Swamy Prasadam : మనందరికీ ఎంతగానో ఇష్టమైన అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని తయారు చేసుకోబోతున్నాం.. సంవత్సరంలో ఒకసారి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని శబరి వెళ్ళినప్పుడు మనందరి కోసం స్వాములు శబరి నుంచి ప్రసాదాన్ని తీసుకొస్తారు. మనం కూడా కొంచమైనా ఎంతో ఇష్టంగా తింటాం. ఈ ప్రసాదం అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే అమృతం లాగా ఉంటుంది. కాబట్టి మరి ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: రెడ్ రైస్, నెయ్యి […]

 Authored By aruna | The Telugu News | Updated on :19 November 2023,11:00 am

ప్రధానాంశాలు:

  •  Ayyappa Swamy Prasadam : అయ్యప్ప స్వామి ప్రసాదం ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి...!

Ayyappa Swamy Prasadam : మనందరికీ ఎంతగానో ఇష్టమైన అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని తయారు చేసుకోబోతున్నాం.. సంవత్సరంలో ఒకసారి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని శబరి వెళ్ళినప్పుడు మనందరి కోసం స్వాములు శబరి నుంచి ప్రసాదాన్ని తీసుకొస్తారు. మనం కూడా కొంచమైనా ఎంతో ఇష్టంగా తింటాం. ఈ ప్రసాదం అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే అమృతం లాగా ఉంటుంది. కాబట్టి మరి ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: రెడ్ రైస్, నెయ్యి ఎండు కొబ్బరి ముక్కలు, శొంఠిపొడి, తాటి బెల్లం మొదలైనవి..  తయారీ విధానం: ప్రసాదం కోసం కప్పు రెడ్ రైస్ ని తీసుకోవాలి. ఇవి ఈజీగా సూపర్ మార్కెట్స్ లో లభిస్తాయి. లేదా ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఇవి దొరకని బ్రౌన్ రైస్ కూడా వాడొచ్చు.. ఈ రైస్ ని ఒక బౌల్లోకి తీసుకుని ఇందులోకి సరిపడినంత వాటర్ ని యాడ్ చేసి ఇప్పుడు చేతులతో ఈ బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కుని నీలంతా వంపేసి బియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ కొబ్బరి ముక్కలు పెద్దగా కొస్తే తినేటప్పుడు గట్టిగా తగులుతాయి. కాబట్టి ముక్కలు చిన్నగా కోసుకోండి. ముక్కలు లైట్ గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక బౌల్ లోకి తీసుకుని ఇందులోకి మనం ముందుగా శుభ్రపరుచుకున్నా బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి.

నేతిలో ఈ బియ్యాన్ని రెండు నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. బియ్యం నేతిలో వేయించుకోవడం వల్ల స్టిఫ్ గా ఉంటాయి. ఓవర్ కుక్ అవ్వకుండా రైస్ మెత్తగా కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మూడు కప్పుల వాటార్న్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఒక కప్పు రైస్ కి మూడు కప్పుల నీళ్లు అనమాట.. అదే మీరు బ్రౌన్ రైస్ వాడితే రెండు కప్పుల వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఐదు నుంచి పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని రైస్ బాగా కుక్ అయిన తర్వాత మూడు కప్పుల తాటి బెల్లాన్ని ఆడ్ చేసుకోవాలి. అంటే ఒక కప్పు రైస్ కి మూడు కప్పుల తాటి బెల్లం సరిపోతుంది. ఇక్కడ తాటి బెల్లాన్ని వాడాలి. ఈ తాటి బెల్లం లో ఎలాంటి డస్ట్ గాని లేవు కాబట్టి డైరెక్ట్ గ రైస్ లోకి బెల్లాన్ని ఆడ్ చేశాను.

మీరు వాడుతున్న బెల్లం లో డస్ట్ ఉంటే సపరేట్గా బెల్లల్లోకి వాటర్ యాడ్ చేసి కరిగిన తర్వాత వడ కట్టి ఆడ్ చేయండి. బెల్లం కరిగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సొంటిపొడి అలాగే మనం ముందుగా నేతిలో వేయించుకున్న ఎండుకొబ్బరి ముక్కలు కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఈ రెసిపీకి కంపల్సరిగా డ్రై జింజర్ పౌడర్ని వాడాలి. కొద్దిగా దగ్గరపడికి పడే వరకు ఉడికించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రసాదాన్ని స్వామి వారికి సమర్పించి మీరు తినవచ్చు… అంతే ఎంతో సింపుల్ గా అయ్యప్ప స్వామి ప్రసాదం రెడీ..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది