Vijay Devarakonda – Rashmika Mandanna : విజయ్ రష్మిక ఎంగేజ్మెంట్ సర్ ప్రైజ్.. నెక్స్ట్ ఇయర్ పెళ్లి ఫిక్సా..?
Vijay Devarakonda – Rashmika Mandanna : రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక ఈ ఇద్దరి జోడీ జోడీ గురించి తెలిసిందే. ఇద్దరు కలిసి గీతా గోవిందం సినిమాతో కలిసి నటించగా అది సూపర్ హిట్ అవ్వగా మళ్లీ ఇద్దరు కలిసి డియర్ కామ్రెడ్ లో కలిసి నటించారు. రెండు సినిమాల పరిచయమే అయినా వాళ్ల మధ్య 8 ఏళ్ల రిలేషన్ ఉంది. కేవలం ఆన్ స్క్రీన్ మీదే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా విజయ్ దేవరకొన రష్మిక ఫ్రెండ్ షిప్ కొనసాగించారు.
ఇద్దరు బయటకు చెప్పట్లేదు కానీ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు.. సీక్రెట్ డేటింగ్ కూడా చేసుకుంటున్నారు. ఐతే ఎవరికి వారు ప్రేమలో ఉన్నా.. ప్రేమించిన వారినే పెళ్లి చేసుకుంటా అని చెప్పడమే కానీ బయట పడట్లేదు. ఈమధ్యనే విజయ్ 35లో ఎవరైనా సైంగిల్ గా ఉంటారా అంటూ తన ప్రేమని కన్ ఫర్మ్ చేశాడు. ఇక పుష్ప 2 ఈవెంట్ లో రష్మిక కూడా నేను అతన్నే పెళ్లాడుతా అనేసింది.
Vijay Devarakonda – Rashmika Mandanna : చూచాయగా వారి ప్రేమ గురించి..
ఇలా ఇద్దరు చూచాయగా వారి ప్రేమ గురించి చెబుతున్నారు. ఐతే వారు చెప్పినా చెప్పకపోయినా విషయం బయట పడిన టైంలో ఇద్దరి గురించి సోషల్ మీడియాలో ఒకటే టాపిక్ అవుతుంది. అందుకే వాళ్లు వారి రిలేషన్ షిప్ ని సైలెంట్ గా కొనసాగిస్తున్నారు. ఏదో ఒకరోజు సడెన్ గా ఎంగేజ్మెంట్ తో షాక్ ఇచ్చేలా ఉన్నారని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి నెక్స్ట్ ఇయర్ ఉంటుందని క్లోజ్ సోర్స్ నుంచి వస్తున్న ఇన్ ఫర్మేషన్. ఐతే పెళ్లి తర్వాత కూడా రష్మిక సినిమాలు కొనసాగించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చేస్తున్నారు. ఐతే పెళ్లి తర్వాత వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చేలా ప్రస్తుతం కమిటైన సినిమాలన్నీ పూర్తి చేసేలా రష్మిక విజయ్ ప్లానింగ్ లో ఉన్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉంది అన్నది చూడాలి. ఐతే ఆఫ్ స్క్రీన్ ఏమో కానీ ఆన్ స్క్రీన్ మీద విజయ్ దేవరకొండ, రష్మిక నటిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.