Vishnu Priya : రెండో వారంలో విష్ణు ప్రియ‌కి పెద్ద దెబ్బ‌.. ఈమెపై సోనియా అంత క‌క్ష్య క‌ట్టిందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vishnu Priya : రెండో వారంలో విష్ణు ప్రియ‌కి పెద్ద దెబ్బ‌.. ఈమెపై సోనియా అంత క‌క్ష్య క‌ట్టిందా?

Vishnu Priya : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది. సీజ‌న్‌8లో నామినేష‌న్స్‌లో భాగంగా భారీ గొడవలు, వాగ్వాదాల మధ్య ముగిసాయి. ఎప్పటిలానే కంటెస్టెంట్లు తమ కారణాలు చెప్పి నామినేషన్స్ వేశారు. ఈ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య తీవ్ర అభిప్రాయ బేధాలు తలెత్తాయి. అయితే ఎవరికి వారు తమ వాదనలు సమర్ధించుకొని ఇంటిలో ఉండటానికి అర్హత లేదంటూ ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ వేశారు. రెండోవారం నామినేషన్స్ సందర్భంగా ప్రేరణ, […]

 Authored By ramu | The Telugu News | Updated on :11 September 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Vishnu Priya : రెండో వారంలో విష్ణు ప్రియ‌కి పెద్ద దెబ్బ‌.. ఈమెపై సోనియా అంత క‌క్ష్య క‌ట్టిందా?

Vishnu Priya : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది. సీజ‌న్‌8లో నామినేష‌న్స్‌లో భాగంగా భారీ గొడవలు, వాగ్వాదాల మధ్య ముగిసాయి. ఎప్పటిలానే కంటెస్టెంట్లు తమ కారణాలు చెప్పి నామినేషన్స్ వేశారు. ఈ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య తీవ్ర అభిప్రాయ బేధాలు తలెత్తాయి. అయితే ఎవరికి వారు తమ వాదనలు సమర్ధించుకొని ఇంటిలో ఉండటానికి అర్హత లేదంటూ ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ వేశారు. రెండోవారం నామినేషన్స్ సందర్భంగా ప్రేరణ, కిర్రాక్ సీత, విష్ణుప్రియ, సోనియా ఆకుల మధ్య భారీగా వాగ్వాదం జరిగింది. ఇంటిలో జరిగిన సంఘటనల ఆధారంగా నామినేషన్ వేసేందుకు ప్రయత్నించగా ఎవరికి వారు డిఫెండ్ చేసుకోవడం కనిపించింది.

Vishnu Priya నామినేష‌న్ ర‌చ్చ‌..

ఇక ఆదిత్య, మణికంఠపై ఇతర కంటెస్టెంట్లు భారీగా ఆరోపణలు చేయడం కనిపించింది. అయితే నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అవకాశం ఉన్న పేర్లను ప్రకటించారు. ఈ వారం నామినేట్ అయిన వారిలో మణికంఠ, ప్రేరణ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, కిర్రాక్ సీత, శేఖర్ బాషా, నైనిక ఉన్నారంటూ ఆయన చెప్పారు. ఈ వారం మొత్తం 8 మంది సభ్యులు ఎలిమినేషన్ ప్రక్రియకు ఎంపికయ్యారు. యాంకర్ విష్ణుప్రియకు బట్టలు వేసుకోవడం కూడా తెలియదని, దానివల్ల మిగతా హౌజ్‌మేట్స్ డిస్‌కంఫర్ట్ ఫీల్ అయ్యారని, అడల్ట్స్ జోక్స్ వేస్తుందని, అందుకోసమే తనను బిగ్ బాస్ షోకి తీసుకున్నారని, తనను మాత్రం అందుకు తీసుకోలేదని, తనపై చేసిన కామెంట్స్ తన ఫ్యామిలీ చూస్తుందని, విష్ణుప్రియకు ఫ్యామిలీ లేదని చాలా పర్సనల్ అటాక్ చేస్తూ క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది సోనియా ఆకుల.

Vishnu Priya రెండో వారంలో విష్ణు ప్రియ‌కి పెద్ద దెబ్బ‌ ఈమెపై సోనియా అంత క‌క్ష్య క‌ట్టిందా

Vishnu Priya : రెండో వారంలో విష్ణు ప్రియ‌కి పెద్ద దెబ్బ‌.. ఈమెపై సోనియా అంత క‌క్ష్య క‌ట్టిందా?

నామినేషన్స్ పూర్తయిన తర్వాత కూడా ఇదే టాపిక్ కొనసాగింది. విష్ణుప్రియ వల్ల డిస్‌కంఫర్ట్ ఫీల్ అయింది హీరో ఆదిత్యం ఓం అని నిఖిల్, అభయ్ నవీన్‌కు చెప్పింది సోనియా. విష్ణుప్రియ బ్లౌజ్ మార్చుకుని, జాకెట్‌లో ఉంది. విష్ణుప్రియ గదిలోకి వచ్చిన సడెన్‌గా వచ్చిన ఆదిత్య ఓం తనను చూసి వణికిపోయి బయటకు వెళ్లిపోయారని సోనియా చెప్పింది.సోనియా కంటే వయసులో చిన్నవాళ్లైనా నైనిక, ప్రేరణ ఎంత మెచ్యుర్‌గా మాట్లాడారో కూడా వీడియోలు షేర్ చేస్తున్నారు. సాధారణంగానే ఆదిత్య గారు ఆడవాళ్లతో డిస్‌కంఫర్ట్ ఉంటారు. ఇలా జరిగే సరికి ఇంకాస్తా ఎక్కువ ఫీల్ అయింటారు కానీ, డిస్‌కంఫర్ట్ కాదు” అని విష్ణుప్రియతో ప్రేరణ అంటే.. “అసలు నామినేట్ చేయాల్సిన పాయింటే కాదు” అని నైనిక చెప్పింది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది