Home » Entertainment » A Very Good Philisophy Of Rakhul Preeth Singh
Entertainment

రకుల్ ప్రీత్ సింగ్ ఫిలాసఫీ బాగానే చెప్పింది .. తెలివంటే అదేమరి..!

Authored By
vamana sai
The Telugu News | Published on: January 11, 2021, 1:30 pm
Advertisement

రకుల్ ప్రీత్ సింగ్ లో మంచి ఫిలాసఫర్ ఉందని తన లేటెస్ట్ కామెంట్స్ చూస్తుంటే తెలుస్తోంది. కెరటం సినిమాతో టాలీవుడ్ కి ఎంటరైన రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి ఎక్‌ప్రెస్ సినిమాతో బాగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలలో నటించి మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా మారింది. తెలుగు, తమిళం, హిందీ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా బిజీగా అయిపోయింది. అయితే అనూహ్యంగా ఫ్లాప్స్ వచ్చిన రకుల్ ప్రీత్ కి మళ్ళీ టాలీవుడ్ లో వరసగా అవకాశాలు దక్కుతున్నాయి.

Advertisement

కేవలం తెలుగులోనే కాదు హిందీలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్ గా మారింది. స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ బాలీవుడ్ లో కూడా హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తోంది. అయితే పడి లేచిన కెరటం లా రకుల్ ప్రీత్ ఇప్పుడు మంచి ఫాం లోకి వచ్చింది. తెలుగులో క్రిష్ సినిమా కంప్లీట్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ నితిన్ తో చెక్ అన్న సినిమా చేస్తోంది. అలాగే బాలీవుడ్ లో అజయ్ దేవగన్ తో మేడే సినిమా తో పాటు తాజాగా మరో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకుంది.

Advertisement

అంతేకాదు తమిళ సినిమాలు రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ఉన్నాయి. అయితే ఏ ఇండస్ట్రీ లో అయినా పోటీ విపరీతంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అదే సినిమా ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా హీరోయిన్స్ మధ్య పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. కాని రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం తనకి తానే పోటీ అని సెన్షేషనల్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయింది. ఇండస్ట్రీలో తనకి ఏ హీరోయిన్ తో పోటీ లేదని… ఉండదని నాకు నేనే పోటీ అని అంటోంది. ఒకరకంగా రకుల్ లో మంచి ఫిలాసఫర్ ఉందని తాజా కామెంట్స్ చూస్తుంటే అర్థమవుతోందని అందరూ చెప్పుకుంటున్నారు. అయితే ఈ కామెంట్స్ ఫ్యూచర్ ని మైండ్ లో పెట్టుకొనే ఇలా తెలివిగా కామెంట్స్ చేసిందని అంటున్నారు.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి