Abhijeet : ఆ విషయంలో సోహెల్ కంటే అభిజిత్ ఎంతో ముందు.. క్రేజ్ అంటే అదే మరి!
Abhijeet : కొందరు సోషల్ మీడియాలో తెగ హడావిడి చేసి నిత్యం హాట్ టాపిక్ అవుతుంటారు. కానీ కొందరు మాత్రం ఎప్పుడూ కూడా అతి చేయరు. వారి పని ఏదో వారు చేసుకుంటూ ఉంటారు. అయినా కూడా అలాంటి వారికి సోషల్ మీడియాలో తెగ ఫాలోయింగ్ ఉంటుంది. అలా సోహెల్ నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఎవరినో ఒకరిని కలుస్తు.. బిగ్ బాస్ కంటెస్టెంట్లతో ఏదో ఒక వీడియో చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంటాడు. కానీ అభిజిత్ మాత్రం ఎప్పుడూ కూడా ఎక్కువ యాక్టివ్‌గా ఉండడు.

Abhijeet Reached 800k instagram Followers
పరిమితంగానే పోస్ట్‌లు పెడుతుంటాడు. కానీ అభిజిత్‌కు సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ అందరికంటే ఎక్కువ. బిగ్ బాష్ ఫినాలే ఎపిసోడ్ ముగిసిన తరువాత సోహెల్ ఎక్కువగా మాట్లాడింది కూడా ఇన్ స్టాగ్రాం ఫాలోవర్ల గురించే. ఇన్ స్టాలో ఎంత మంది ఫాలోవర్లు పెరిగారని మెహబూబ్‌ను అడిగాను.. అంటూ ఏదో కాకమ్మ కథలు చెప్పేశాడు. మొత్తానికి బిగ్ బాస్ కంటెస్టెంట్లలో చాలా మందికి ఇప్పుడు ఇన్ స్టాలో ఫాలోవర్లు పెరిగారు.
అయితే అందరిక కంటే ఎక్కువగా ముందంజలో ఉంది మాత్రం అభిజిత్. అభిజిత్‌కు తాజాగా 8 లక్షల మంది ఫాలోవర్లు తయారయ్యారు. ఈ మేరకు అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. అదే క్రమంలో సోహెల్‌కు 658k, అఖిల్‌కు 462k, మెహబూబ్‌కు 494k, హారికకు 940k, లాస్యకు 1.1మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఈ ఇాద్దరికి బిగ్ బాస్ కంటే ముందుగానే భారీ ఫాలోయింగ్ ఉంది. కానీ అభిజిత్ సోహెల్ అఖిల్ వంటి వారికి బిగ్ బాస్ వల్లే ఇంతటి ఇమేజ్ వచ్చింది. అలా చూసుకుంటే ఈ అందరిలో అభిజిత్ ఎంతో ముందున్నాడు.