Actor : చైల్డ్ ఆర్టిస్ట్ నుండి స్టార్ హీరోగా.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తు పట్టారా..!
ప్రధానాంశాలు:
Actor : చైల్డ్ ఆర్టిస్ట్ నుండి స్టార్ హీరోగా.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తు పట్టారా..!
Actor టాలీవుడ్‌లో చాలామంది స్టార్ హీరోలు తమ సినీ ప్రయాణాన్ని చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా ప్రారంభించి, తర్వాత తనదైన శైలిలో నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకొని అగ్రహీరోలుగా ఎదిగారు.వారిలో విక్టరీ వెంకటేష్ ఒకరు. దగ్గుబాటి రామానాయుడు కుమారుడిగా సినీ కుటుంబంలో జన్మించిన వెంకటేష్, తన చిన్ననాటే వెండితెరపై కనిపించారు.1971లో విడుదలైన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ‘ప్రేమ నగర్’ లో వెంకటేష్ ఓ బాలనటుడిగా నటించారు.

Actor : చైల్డ్ ఆర్టిస్ట్ నుండి స్టార్ హీరోగా.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తు పట్టారా..!
Actor : గుర్తు పట్టండి..
ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ లీడ్ రోల్స్ లో నటించగా, ఏఎన్నార్ చిన్ననాటి పాత్రలో వెంకటేష్ నటించారు. ఈ పాత్ర పేరు కేశవ్ వర్మ. అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.1986లో ‘కలియుగ పాండవులు’ సినిమా ద్వారా హీరోగా తెలుగు తెరకు పరిచయమైన వెంకటేష్, అప్పటి నుంచి వెనక్కి తగ్గలేదు. అనేక హిట్ సినిమాలు అందిస్తూ తన పేరు ముందు ‘విక్టరీ’ అనే బిరుదు చేర్చుకున్నారు. రొమాంటిక్, ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ – ఇలా అన్ని రకాల పాత్రల్లో మెప్పించిన ఆయన, ఇప్పటికీ విభిన్న కథలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
వెంకటేష్ కెరీర్‌లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం అధిక మల్టీస్టారర్ సినిమాలు చేసిన హీరో అనే రికార్డు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, నాగ చైతన్య, వరుణ్ తేజ్ వంటి యువ హీరోలతో కలిసి సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు. బాలకృష్ణతో కలిసి ఓ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కూడా ఆయన చేతిలో ఉంది. చిన్న వయసులో నటనలోకి ప్రవేశించి, తనదైన ముద్ర వేసుకున్న వెంకటేష్ ఓ బ్రాండ్‌గా నిలిచారు.