TV Anchor : ఎండ‌ల వార్త‌లు చ‌దువుతూ స్పృహ త‌ప్పి ప‌డిపోయిన యాంక‌ర్..వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TV Anchor : ఎండ‌ల వార్త‌లు చ‌దువుతూ స్పృహ త‌ప్పి ప‌డిపోయిన యాంక‌ర్..వీడియో !

 Authored By ramu | The Telugu News | Updated on :21 April 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  TV Anchor : ఎండ‌ల వార్త‌లు చ‌దువుతూ స్పృహ త‌ప్పి ప‌డిపోయిన యాంక‌ర్..!

TV Anchor : ఎండాకాలం వ‌స్తే చిన్న పిల్ల‌ల‌తో పాటు ముస‌లి వాళ్లు చాలా ఇబ్బంది ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. భానుడి భగభగలతో దేశం నిప్పుల కొలిమిలా మారింది. ఎండ వేడిమి, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు మండలాల్లో రెడ్‌ అలెర్ట్‌ కూడా జారీ చేశారు ..ఎండల వేడిమి తాళలేక వడదెబ్బ తగిలి వివిధ జిల్లాల్లో మ‌ర‌ణించారు. అయితే ఎవ‌రు ఎన్ని జాగ్ర‌త్తలు తీసుకున్నా కూడా కొన్ని సంద‌ర్భాల‌లో ప‌లువురు వ‌డ‌దెబ్బ బారిన ప‌డుతున్నారు. అయితే వేసవితాపం తీవ్రతను తెలియజేసే ఓ ఘటన ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.. ఆరు బయట తిరిగే వారికే కాదు, గ‌దుల మధ్య ఉండేవారు కూడా అధిక ఉష్ణోగ్రత కారణంగా పలు ఇబ్బందుల‌కి గుర‌వుతున్నార‌ని తాజా ఘ‌ట‌న అద్ధం ప‌డుతుంది..

TV Anchor : వడదెబ్బకు గురైన టీవీ యాంకర్

వివ‌రాల‌లోకి వెళితే దూరదర్శన్‌ కోల్‌కతా బ్రాంచిలో లోపముద్ర అనే యాంకర్‌ వాతావరణ వార్తలు చదువుతోంది. సరిగ్గా, అధిక వేడిమి గురించి వార్తలు చదువుతుండగా, ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లి కళ్లు మూసుకుంటూ కుర్చీలో వెనక్కి వాలిపోయింది. ఇది గమనించిన స్టూడియో సిబ్బంది వెంటనే ఆమె ముఖంపై నీళ్లు చల్లి స‌ప‌ర్య‌లు చేయ‌డంతో తిరిగి కోలుకుంది. అయితే త‌ర్వాత ఆమె మాట్లాడుఊ..స్టూడియోలో కూలింగ్‌ సిస్టమ్‌ ఉన్నప్పటికీ వేడిగా ఉండ‌డం వ‌ల‌న ఒక్క‌సారిగా తనకు కళ్లుమూత పడ్డాయని, కళ్లు మసకబారుతూ టెలి ప్రాంప్టర్‌ కనిపించకుండా పోయిందని చెప్పుకొచ్చింది.

TV Anchor ఎండ‌ల వార్త‌లు చ‌దువుతూ స్పృహ త‌ప్పి ప‌డిపోయిన యాంక‌ర్

TV Anchor : ఎండ‌ల వార్త‌లు చ‌దువుతూ స్పృహ త‌ప్పి ప‌డిపోయిన యాంక‌ర్..!

డీ హైడ్రేషన్‌ కారణంగా బీపీ లెవల్స్‌ పడిపోవడమే అందుకు కారణమై ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఓ గ్లాసు నీళ్లు తాగిన తర్వాత కుదుటపడ్డానని తన ఫేస్ బుక్ వీడియోలో చెప్పారు. పశ్చిమ బెంగాల్ లోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కు పైబడి నమోదవుతుండ‌డంతో అక్క‌డి ప్ర‌జ‌లు కూడా భ‌యంతో వణికిపోతున్నారు. దక్షిణ, ఉత్తర 24 పరగణాలు, పర్బా, పశ్చిమ భర్ధమాన్, పశ్చిమ మేదినిపూర్, పురూలియా, ఝర్ గ్రామ్, భిర్భూమ్, ముర్షీదాబాద్, బంకురా జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. అయితే అధిక వేడిమి వ‌ల‌న త‌న‌కు ఇలా జ‌రిగిందంటుంది. తన 21 ఏళ్ల కెరీర్‌లో 15 నిమిషాలు, 30 నిమిషాల నిడివిగల బులెటిన్‌లు ఎన్నో చదవానని, ఎప్పుడూ ఇలా జరగలేదని అన్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది