Rajendra Prasad COVID Positive : బ్రేకింగ్.. నటుడు రాజేంద్ర ప్రసాద్ కు కరోనా…ఆసుపత్రిలో చేరిక..!
Rajendra Prasad COVID Positive : టాలీవుడ్ నటుడు, కామెడీ కింగ్ రాజేంద్ర ప్రసాద్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు తేలికపాటి మహమ్మారి లక్షణాలు కనిపించడంతో వైద్య నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ లోని యేజీ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఏఐజీ ఆసుపత్రి వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో ఆయన అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. తమ అభిమాన నటుడు మహమ్మారి బారి నుంచి త్వరగా కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు. అప్పుడే సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున సందేశాలను పోస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా భారత్ లో గత రెండు రోజులుగా లక్షకు పైగా కేసులు నమోదు అవుతూ మూడో వేవ్ కు స్వాగతం పలుకుతున్నాయి.

Actor Rajendra Prasad tested COVID positive
ఇప్పటికే పలువురు రాజకీయ సినీ ప్రముఖులు మహమ్మారి బారిన పడి చికిత్స పొందుతున్నారు. హీరో మహేష్ బాబు, హీరోయిన్ త్రిష, మంచు లక్ష్మి, నటుడు సత్య రాజ్ వంటి పలువురు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.