Actor Venu : అక్కడ ఎల‌గబెట్టాను, బెల్ట్ తెగేలా త‌న్నులు తిన్నానంటూ వేణు షాకింగ్ కామెంట్స్

Authored By Sam C | The Telugu News | Published on: July 13, 2022, 5:30 pm

Actor Venu : స్వ‌యంవ‌రం, చిరున‌వ్వుతో, హ‌నుమాన్ జంక్ష‌న్, క‌ళ్యాణ రాముడు, పెళ్లాం ఊరెళితే, ఖుషీఖుషీగా, చెప్ప‌వే చిరుగాలి ఇలా వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని మెప్పించాడు వేణు. కొన్నాళ్లుగా వెండితెర‌కు దూరంగా ఉన్న వేణు ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌బోతున్నాడు. సీఐ మురళి పాత్రలో వేణు కనిపించబోతోన్నాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా ముందుకు వస్తున్నాడు. ఇదే క్రమంలో వేణు తొట్టెంపూడి ఆలీతో సరదాగా షోలోకి వచ్చాడు. ఎప్ప‌టి నుండో ఈ షోకి వెళ్ల‌మ‌ని వేణు వాళ్ల అమ్మ చెప్పేద‌ట‌. ఎట్ట‌కేల‌కు ఆలీతో స‌ర‌దాగాకి వ‌చ్చినందుకు సంతోషంగా ఉంద‌ని వేణు అన్నాడు.

త‌న హైట్ ఆరు అడుగుల మూడంగుళాలు అని వేణు చెప్ప‌డంతో ఏం చేసుకుంటావు అని ఆలీ అన్నాడు. తనను మొదటగా స్క్రీన్‌కు పరిచయం చేయాల్సింది భారతీ రాజానే అని, కానీ మిస్ అయిందంటూ తెలిపాడు. చిరునవ్వు ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ కోసం చాలా నెలలు వెయిట్ చేశామన్నాడు వేణు.తనను మొదటి సారి చూసినప్పుడు మరింత వినయంగా ప్రవర్తించాడని వేణు గురించి ఆలీ చెప్పుకొచ్చాడు. తన మొదటి చిత్రం నుంచి ఇప్పటి వరకు ఆలీ గారు తనని వేలు పట్టుకుని నడిపించాడని, ఈ షర్ట్ కూడా తనదే అంటూ వేణు నవ్వులు పూయించాడు. ఇక బెంగ‌ళూరులో చదువుకుంటాను అని చెప్పి ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను అని చెప్పేవాడిని..

Actor Venu comments about Puri Jagannath

Actor Venu comments about Puri Jagannath

Actor Venu : షాకింగ్ విష‌యాలు..

వెళ్లి సినిమాలు చూసుకుంటూ ఉండేవాడినంటూ వేణు నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. ఆ విషయం తన ఫాదర్‌కి తెలిసి చితక్కొట్టేశాడని, బెల్ట్ కూడా తెగింద‌ని, ఇక తరువాత నుంచి రెగ్యులర్‌గా సినిమాలకు వెళ్లానని వేణు అన్నాడు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా కథని మొదట పూరి జగన్నాథ్ హీరో వేణు తో చేస్తానని చెప్పి చేయ‌లేదు. అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమా లో హీరో మీరే, యాంకర్ మీరే, అన్ని కవర్ చేస్తారని తెలియజేశారట కానీ చివరికి సినిమాలో మాత్రం తనని తీసుకోలేదని తెలియజేశారు వేణు. కానీ ఆ సంఘటన మాత్రం తనని చాలా బాధ పెడుతోంది అన్నట్లుగా తెలిపారు.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp