Actress Indraja: ఇమానుయ్యేల్ పరువుతీసిన ఇంద్రజ.. ఎక్కడైనా రాసుకోరా!
Actress Indraja: ప్రతి ఆదివారం మధ్యాహ్నం స్టార్ మాలో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం ద్వారా జబర్దస్త్ కమెడియన్స్ తమదైన శైలిలో కామెడీ పంచులు లతో ప్రేక్షకులను ఎంతగానో సందడి చేస్తున్నారు.ఇకపోతే వచ్చే వారం ఈ కార్యక్రమాన్ని నూతన సంవత్సరం వేడుకగా స్వర్గంలో నిర్వహిస్తున్నట్లు యాంకర్ సుడిగాలి సుదీర్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చే ఇంద్రజ రాగానే దేవుడి గెటప్ లో ఉన్న రాఘవ ఇంద్రజ తో మాట్లాడుతూ సెటైర్లు వేశారు.

Actress Indraja shocking comments on Immanuel in sridevi drama company latest promo
ఈ సందర్భంగా రాఘవ ఇంద్రజతో మాట్లాడుతూ మీరు స్వర్గంలోనే ఉండిపోకూడదు అంటూ అనగా.. అందుకు ఇంద్రజ లేదండి నాకు ప్రేక్షకుల గుండె స్వర్గం అందుకే అక్కడే ఉండిపోతాను అంటూ తనదైన శైలిలో డైలాగ్ వేస్తుంది. దీంతో పక్కనే ఉన్న ఇమ్మానియేల్ కలుగజేసుకుని అమ్మగారు.. ఈ డైలాగ్ వాళ్లు రాసుకున్నారా.. లేక మీరు రాసుకున్నారా అంటు తనపై సెటైర్ వేస్తారు.
ఇమ్మానుయేల్ ను అవమానపరిచిన ఇంద్రజ:
ఇమ్మానియేల్ ఒక్కసారిగా అలా అనడంతో వెంటనే ఇంద్రజ స్పందిస్తూ… ఇవన్నీ ఆలోచించే బదులు ఇక్కడ ఏమైనా రాసుకోవచ్చు కదా రా అంటూ తన మేకప్ గురించి చెబుతుంది. ఇమ్మానియేల్ నల్లగా ఉండడంతో ఇంద్రజ ఇలా మాట్లాడుతూ తనపై సెటైర్ వేస్తూ తన పరువు మొత్తం తీసింది. అనంతరం ఈ కార్యక్రమానికి మరొక జడ్జిగా సీనియర్ హీరోయిన్ మహేశ్వరి కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఇది వైరల్ గా మారింది.
